సినిమాలు.. ఆ ప్రపంచమే నరకం!

First Published 31, May 2018, 10:45 AM IST
sammohanam movie trailer talk
Highlights

సుదీర్ బాబు హీరోగా దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ రూపొందించిన చిత్రం 'సమ్మోహనం'

సుదీర్ బాబు హీరోగా దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ రూపొందించిన చిత్రం 'సమ్మోహనం'. అదితిరావ్ హైదరి హీరోయిన్ గా కనిపించనుంది. ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ ను ఆయన చేతుల మీదుగా విడుదల చేశారు.

'సినిమాలు.. ఆ ప్రపంచమే నరకం నాన్న' అంటూ సుదీర్ బాబు సీనియర్ నటుడు నరేష్ తో చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. సినిమాలే నచ్చని యువకుడు ఒక హీరోయిన్ ను ప్రేమించడం.. ఆ తరువాత కొన్ని కారణాల వలన ఇద్దరూ విడిపోవడం ఆ సమయంలో 'సినిమా వాళ్ల మీద నాకున్న అభిప్రాయం తప్పనుకున్నా నిన్ను కలిసిన తరువాత.. కాదని చెంప పగలగొట్టి మరీ నిరూపించావ్. మనుషుల్ని వాడుకోవడం మీ ప్రొఫెషన్ లో చాలా సాధారణం అనుకుంటా' అంటూ పలికిన మాటలను బట్టి సినిమా ఎలా ఉండబోతుందో చెప్పేశాడు దర్శకుడు. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమా జూన్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.  

 

loader