పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  మాజీ భార్య, సినీ నటి రేణుదేశాయ్ కి కొద్దిరోజులుగా సోషల్ మీడియా వేదిక వివాదం నడుస్తోంది. రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోబోతోందంటూ మీడియాలో వార్తలు రాగానే.. ఆమెను హేట్ చేస్తూ పవన్ ఫ్యాన్స్ కొందరు మేసేజీలు చేశారు. దీనిపై ఇటీవల రేణు.. తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. మన దేశంలో మగవాళ్లు ఎన్ని పెళ్లిళ్లు అయినా చేసుకోవచ్చు గానీ.. ఆడవాళ్లు ఆ ఆలోచన కూడా చేయకూడదా అంటూ ప్రశ్నించారు. దీనిపై ఇప్పటివరకు సినీ నటులు ఎవరూ స్పందించలేదు. అయితే తాజాగా  తెర వెనుక సమంత అదే నండి సింగర్, డబ్బింగ్ ఆర్టిస్టు చిన్మయి స్పందించారు.

 

‘ కొందరు మహిళలు వారి జీవితంలో సరైన వ్యక్తిని ఎంచుకోనప్పుడు వారికి వారు క్షమాపణలు చెప్పుకోవాలి. అంతేకాకుండా ఇతరుల అసమ్షన్స్ కూడా క్లారిఫై చేయాల్సి ఉంటుంది. ఆ మహిళకు ఎవరైనా సలహాలు ఇస్తే చాలా బాగుంటుంది. కానీ చాలా మంది సోషల్ మీడియాను మహిళలను అవమానించడానికి ఉపయోగిస్తున్నారు. ఒక మన దేశంలోనే కాదు. ప్రపంచ వ్యాప్తంగా అలానే చేస్తున్నారు. అలాంటి వ్యక్తులను నేను ఇప్పటివరకు చాలా మందిని చూశాను. 2017 మార్చిలో నేను ఇలాంటి సంఘటననే ఎదురుకున్నాను. కానీ ఇది వేరు. ఇలాంటివి ఎదురైనప్పుడు మరింత స్ట్రాంగ్ గా తయారైతారు. నేనెంటో నాకు తెలుసు. నా క్యారెక్టర్ గురించి ఎవరూ సర్టిఫెకేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరు ఏమన్నా.. నేనంటో నా కుటుంబానికి తెలుసు. నిజమేంటో దేవుడి కి తెలుసు.’ అంటూ చిన్మయి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

 

ఆమె చేసిన పోస్టు.. రేణు దేశాయ్ గురించేనని అందరికీ అర్థమైంది. దీంతో పలువురు ఆమెకు మద్దతుగా మాట్లాడగా.. మరికొందరు తిట్టడం మొదలెట్టారు. దీంతో చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ రంగంలోకి దిగారు. తన భార్య చిన్మయి... పవన్ కి పెద్ద అభిమాని అని. ఆయనను ఆమె ఏమీ అనలేదని రాహుల్ తెలిపారు. తనకు కూడా పవన్ అంటే ఇష్టమని.. ఆయనలా ఉండాలని ప్రయత్నిస్తానని చెప్పారు. దయచేసి తన భార్య చిన్మయి ని తిట్టడం ఆపాల్సిందిగా ఆయన సోషల్ మీడియా వేదికగా కోరారు.