తెలుగు ఇండస్ట్రీ లేటెస్ట్ క్యూట్ కపుల్ సమంత,నాగచైతన్య. ఏం మాయ చేసావే సినిమాతో కలిసి పనిచేసిన ఈ జంట ఇటీవలే పెళ్లి చేసుకుని చాలా హ్యాపీగా ఉన్నారు. చైతును సమంత ఎంతగా ప్రేమిస్తుందో ఆమె మాటల్లోనే అర్ధమవుతుంటుంది.

 

ఇక పెళ్లయ్యాక నాగచైతన్య ఈరోజు తన తొలి పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. చైతూ సమంత నా సర్వస్వం నువ్వే అంటూ మెసేజ్ పోస్ట్ చేసి సర్ ప్రైజ్ చేసింది సమంత. చైతుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మంత జస్ట్ విష్ చేయడమే కాకుండా... నీ మనసులో నువ్వేం కోరుకుంటున్నావో అది ఇవ్వమని దేవుడిని ప్రార్ధిస్తున్నా అంటూ మెసేజ్ పెట్టింది. నా సర్వస్వం నువ్వే అనే మాట సమంత పెట్టడం ఇంప్రెస్ చేసింది.

 

చైతన్య మీద ఉన్న ప్రేమను ఇలా బయటపెట్టిన సమంత మంచి మనసుకి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. క్రిస్టియన్ పద్ధతిలో జరిగిన మ్యారేజ్ పిక్ గ్రీటింగ్స్ లో పెట్టి మెసేజ్ పోస్ట్ చేసింది సమంత. అక్కినేని కోడలిగా సమంత అందరి మనసులను గెలుచుకుంటోంది.

 

ప్రస్థుతం సమంత రంగస్థలం సినిమాలో నటిస్తుండగా చైతూ.. సవ్యసాచి సినిమాతో బిజీగా వున్నారు.