Asianet News TeluguAsianet News Telugu

Samantha: ట్రెండింగ్ లో సమంత ఐటమ్ సాంగ్...పాట కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో తెలుసా..?

సోషల్ మీడియాలో దూసుకుపోతోంది పుష్ప సినిమాలో సమంత స్పెషల్ సాంగ్. రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే కోట్లలో వ్యూస్ సాధించింది.  కాదు ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ సాంగ్ బడ్జెట్ హాట్ టాపిక్ అవుతోంది. 
 

Samantha  Special Song Trending in Pushpa Movie
Author
Hyderabad, First Published Dec 15, 2021, 4:28 PM IST

సోషల్ మీడియాలో దూసుకుపోతోంది పుష్ప సినిమాలో సమంత స్పెషల్ సాంగ్. రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే కోట్ల వ్యూస్ సాధిస్తోంది. అంతే కాదు ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ సాంగ్ బడ్జెట్ హాట్ టాపిక్ అవుతోంది. 


ఈనెల 17 న ప్రపంచ వ్యాప్తంగా 5 భాషల్లో రిలీజ్ కాబోతోంది పుష్ప(Pushpa ) మూవీ. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా సమంత(Samantha) స్పెషల్ సాంగ్ మారిపోయింది. రీసెంట్ గా రిలీజ్ అయిన సమంత ఊ అంటావా మావా సాంగ్ ట్రెండింగ్ లో ఉంది. ఇప్పటికే 4 కోట్ల 50 లక్షలకు పైగా ఫ్యూస్ తో పాటు 16 లక్షల లైక్స్ తో దూసుకుపోతోంది. దేవిశ్రీ( Devisri) మ్యూజిక్ చేసిన ఈ ఐటమ్ సాంగ్ కు సమంత డాన్స్ పర్ఫామెన్స్ తో బ్యూటీ తెచ్చింది. ఈ సాంగ్ యూత్ లో గట్టి ప్రభావమే చూపించింది. 

సమంత(Samantha ) ఫస్ట్ టైమ్ పుష్ప మూవీ కోసం ఐటమ్ సాంగ్ చేసింది. ఈ పాటను ముందే అనుకోలేదు. సినిమా ప్రమోషన్ కోసం.. స్టార్ హీరోయిన్ తో ఇలాంటి పాట కావాలని  అనుకుని అప్పటికప్పుడే సమంతను ఒప్పించి.. వారం రోజుల్లో షూటింగ్,ఎడిటింగ్ పూర్తి చేసి పాటను రిలీజ్ చేశారు టీమ్. అంతే కాదు ఈ సాంగ్ కోసం ఎటువంటి షరతులు లేకుండా సమంత సాంగ్ ను కంప్లీట్ చేసినట్టు అల్లు అర్జునే స్వయంగా చెప్పారు. 

Also Read : BALAYYA-RAJAMOULI : బాలయ్యతో రాజమౌళి..ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్


ఇక ఈ సాంగ్ కోసం పెట్టిన బడ్జెట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఐటమ్ సాంగ్ కోసం ఏకండా 5 కోట్ల వరకూ బడ్జెట్ ను ఖర్చుక పెట్టారట మేకర్స్. అంతే కాదు, సాంగ్ చేసినందకు సమంతకు ఏకంగా కోటి వరకూ రెమ్యూనరేష్ కూడా ముట్టచెప్పినట్టు తెలుస్తోంది. సాంగ్ కోసం స్పెషల్ గా సెట్ వేసి మరీ షూటింగ్ ను కంప్లీట్ చేసుకున్నరు పుష్ప టీమ్. 


ఈ సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి ఏదో ఒక రకంగా హాట్ టాపిక్ అవుతూనే ఉంది. పాటలో మగవారి మనోభావాలు దెబ్బతిన్నాయంటూ.. పురుష సంఘం నుంచి వ్యతిరకత వచ్చింది. కొంత మందికి ఈ సాంగ్ బాగా నచ్చింది. మరికొంత మందికి నచ్చక.. విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైనా పుష్పలో Samantha  స్పెషల్ సాంగ్ ఆ సినిమాకు అద్భుతంగా వర్కౌట్ అవుతుందనే చెప్పాలి. 


Also Read : SUNIL-PUSHPA : ఇండస్ట్రీకి వచ్చిందే విలన్ అవ్వాలని : సునిల్

Follow Us:
Download App:
  • android
  • ios