Asianet News TeluguAsianet News Telugu

BALAYYA-RAJAMOULI : బాలయ్యతో రాజమౌళి..ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

నటసింహం బాలయ్యతో స్టార్ డైరెక్టర్ రాజమౌళి సందడి చేయబోతున్నారు. అయితే ఇది సినిమా కోసం కాదు, బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో కోసం.
 

Balakrishna With Rajamouli Unstoppable
Author
Hyderabad, First Published Dec 15, 2021, 1:19 PM IST

బాలయ్య బాబు మంచి జోష్ మీద ఉన్నారు... కుర్ర హీరోలను మించి స్పీడ్ కూడా చూపిస్తున్నారు. ప్రస్తుతం అఖండ సూపర్ సక్సెస్ జోష లో ఉన్న బాలకృష్ణ.. వెంటనే మలినేని గోపీచంద్ సినిమాను స్టార్ట్ చేశారు కూడా. ఈ సినిమాతో పాటు అనిల్ రావిపూడి, పూరీ జగన్నాథ్, తో సినిమాలు సెట్ చేసుకుని పెట్టుకున్నారు. మరో రెండుమూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఇటు సినిమాలు చేస్తూనే అటు బుల్లితెరపై కూడా సందడి చేస్తున్నారు బాలకృష్ణ. 

తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో అన్ స్టాపబుల్ అంటూ.. హడావిడి చేస్తున్నారు నటసింహం. షోను సక్సెస్ పుల్ గా రన్ చేస్తున్నారు. ఈ షో కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ కూడా కాన్సర్ పేషంట్స్ కు ఇస్తున్నారు బాలకృష్ణ. ఇక ఇప్పటికే అను స్టాపబుల్ నాలుగు ఎపిసోడ్స్ ను విజయవంతంగా పూర్తి చేసిన బాలయ్య..ఐదో ఎపిసోడ్ కోసం యూనివర్సల్ డైరెక్టర్ రాజమౌళిని రంగంలోకి దింపారు. రాజమౌళితో పాటు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కూడా ఈ షోలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన పిక్స్ రిలీజ్ చేసిన టీమ్.. ప్రోమోను త్వరలో విడుదల చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. రాజమౌళితో బాలయ్య బాబు ఇంటర్వ్యూ అని తెలిసి ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ షోలో ఇంట్రెస్టింగ్ విషయాలు ఎన్ని బయటకు వస్తాయా అని ఆలోచిస్తున్నారు. 

Also Read : Balakrishna: మల్టీ స్టారర్ చేస్తానన్న బాలయ్య.. ఎన్టీఆర్ తోనే చేయబోతున్నారా...?

ఇప్పటికే ఆహాలో అన్ స్టాపబుల్ నాలుగు ఎపిసోడ్స్ ను పూర్తి చేశారు బాలయ్య. టాలీవుడ్ స్టార్ కాస్ట్ ను వరుసగా తనదైన స్టైల్ లో ఇంటర్వ్యూ చేస్తున్నారు. స్టార్ సెలబ్రిటీలు కూడా అన్ స్టాపబుల్ కు వరుస కడుతున్నారు. రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూడా ఎపిసోడ్ షూట్ ఫినిష్ చేశాడు బాలయ్య. మంచి అకేషన్ చూసి ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేయాలని చూస్తున్నారు. ముందు ముందు వెంకటేష్, ఎన్టీఆర్, మెగాస్టార్... ఇలా స్టార్ గెస్ట్ లు అన్ స్టాపబుల్ లో సందడి చేయబోతున్నట్టు తెలుస్తోంది. 


ఇక ఫస్ట్ ఎపిసోడ్ లో మంచు ఫ్యామిలీని, సెకండ్ ఎపిస్డోడ్ లో నేచురల్ స్టార్ నానిని, మూడో ఎపిసోడ్ లో బ్రహ్మానందం, అనిల్ రావిపూడిని, నాలుగోవ ఎపిసోడ్ లో అఖండా టీమ్ ను ఇంటర్వ్యూ చేశారు బాలయ్య, ఐదో ఎపిసోడ్ లో రాజమౌళి, కీరవాణీలతో సందడి చేయబోతున్నారు. ఫ్యూచర్ లో ఇంకా ఎలాంటి స్టార్ గెస్ట్ లు అన్ స్టాపబుల్ లో సందడి చేస్తారో చూడాలి. 
Also Read : Pushpa: దిల్ రాజు పెద్ద రిస్క్ తీసుకున్నాడా?

Follow Us:
Download App:
  • android
  • ios