SUNIL-PUSHPA : ఇండస్ట్రీకి వచ్చిందే విలన్ అవ్వాలని : సునిల్
విలన్ గా నటించడం కోసమే ఇండస్ట్రీకి వచ్చానన్నారు కమెడియన్ కమ్ హీరో సునిల్. పుష్ప సినిమాలో మంగళం శీనుగా.. క్రూయల్ విలన్ క్యారెక్టర్ లో కనిపించారు సునిల్. కెరీర్ లో ఫస్ట్ టైమ్ విలన్ గా నటించిన సునిల్.. పుష్ప మూవీ గురించి విశేషాలు పంచుకున్నారు.
పుష్ప లో నా క్యారెక్టర్ పేరు మంగళం శీను.ఇది కంప్లీట్ గా నెగెటివ్ క్యారెక్టర్. అంతే కాదు ఈ మంగళం శ్రీను పాత్ర, నా లైఫ్ లోకంటే కూడా ఒక పది సంవత్సరాలు పెద్ద వయస్సు క్యారెక్టర్ చేశాను. సుకుమార్ కరోనా కు ముందు ఈ క్యారెక్టర్ గురించి చెప్పారు. చెప్పగానే భలే క్యారెక్టర్ వచ్చింది అని సంతోషపడ్డాను. ఫస్ట్ టైమ్ వేరే గెటప్ తో.. వేరే ఎజ్ గ్రూప్ లో వుండి చేశాను. నాకు ఇచ్చిన క్యారెక్టర్ కి న్యాయం చేశాను అనుకుంటున్నాను.
అసలు నేను ఇండస్ట్రీ కి వచ్చింది విలన్ గా నటిద్దామని. కాని అనుకోకుండా కమెడియన్ గా సెటిల్ అయ్యాను. ఆతరువాత హీరోగా..ఇక ఇండస్ట్రీకి వచ్చిన ఇన్ని సంవత్సరాల తరువాత నేను విలన్ గా నటించే అవాకశం వచ్చింది. అయితే ఈ సినిమాలో అందరూ నేచురల్ గా నటిస్తున్నారు..నేను డ్రమాటిక్ గా చేస్తే నేచురాలిటీ మిస్ అవుతుంది అనుకోని నేచురల్ గానే నటించాను.
Also Read : ALLU ARJUN-PUSHPA : రాజమౌళితో త్వరలో సినిమా ఉంటుంది : అల్లు అర్జున్
ఒక స్విచ్యువేషన్ లో మల్టిపుల్ తింగ్స్ ప్లే అవుతూ వుంటాయి. వాటిని పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేయగలగాలి. డైరెక్టర్ సుకుమార్ అందరినీ పాత్రలకు తగ్గట్టు పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేసి.. ప్రాక్టీస్ చేయించాడు. సినిమా విషయంలో చాలా స్ట్రిక్ట్ గా.. సిన్సియర్ గా పనిచేశామ్. ముఖ్యంగా ఫారెస్ట్ లొకేషన్ లో వున్నప్పుడు ఏ కాల్ రాకూడదు అనుకునేవాడిని. ఎందుకంటే.. ఇలాంటి పాత్ర చేస్తున్నప్పుడు షూటింగ్ లో కాల్స్ వస్తే.. డిస్ట్రబ్ అవుతాము. దాంతో చేస్తున్న పాత్రలోసంతృప్తిగా నటించలేము.
ఇక ముందు కెరీర్ లో మంచి నిర్ణయాలు తీసుకుంటాను. నేను ఇదే చెయ్యాలి.. ఈ క్యారెక్ట్ అయితేనే చేస్తాను అని గిరి గీసుకొని ఉండను. ఏదైనా చెయ్యడానికి రెడీ గా వున్నాను. ఇక నాకు నచ్చిన సినిమాలు అంటే.. యోగి బాబు చేసిన మండేలా సినిమా నాకు బాగా నచ్చింది. ఈ భాష.. ఆ భాష అంటూ.. లాంగ్వేజ్ హద్దులు ఏమి పెట్టుకో లేదు. ఎక్కడ అవకాశం వచ్చినా నటించడానికి రెడీగా ఉన్నాను.
Also Read : Pushpa:హిందీ ‘పుష్ప’ ఓపెనింగ్స్ దారుణం?