శరవేగంగా సుకుమార్, రామ్ చరణ్ ల రంగస్థలం మూవీ షూటింగ్ రాజమండ్రి పరిసరాల్లో ఇటీవలే షూటింగ్ షెడ్యూల్ ముగించుకున్న టీమ్ హైదరాబాద్ లో తిరిగి కొనసాగుతున్న రంగస్థలం 1985 షూటింగ్ 

రామ్ చరణ్, సుకుమార్ ల రంగస్థలం1985 మూవీ రాజమండ్రి పరిసరాల్లో షూటింగ్ ముగించుకుని తిరిగి హైదరాబాద్ కు యూనిట్ అంతా మకాం మార్చింది. ఈ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న సమంత సినిమా కోసం చాలా త్యాగాలు చేస్తోంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ రంపచోడవరం అటవీ ప్రాంతంలో జరిగింది. కనీస వసతులు కూడా లేని ఈ ప్రాంతంలో కీలక సన్నివేశాల చిత్రీకరణ చేశారు. అయితే అలాంటి పరిస్థితుల్లో కూడా రామ్ చరణ్, సమంతలు ఎలాంటి కంప్లైంట్ చేయకుండా షూటింగ్ చేశారు.



షూటింగ్ లొకేషన్ లో సమంత స్టిల్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా షూటింగ్ కు సంబంధించి సమంత చేసిన ట్వీట్ మరింత ఆసక్తికరంగా మారింది. 'వారం పాటు ఫోన్ లేకుండా.. అంత ఇబ్బందిగా లేదు.. నేను మరోసారి కూడా ఇలా ఉండగలను..?' అంటూ ట్వీట్ చేసింది. తెలుగు తమిళ భాషల్లో ఫుల్ బిజీగా ఉన్న సమంత అక్టోబర్ లో నాగచైతన్నతో పెళ్లికి రెడీ అవుతోంది. పెళ్లి లోపే షూటిగులన్నీ ముగించుకుని నెల రోజుల ముందే ప్యాకప్ చెప్పాలని ప్లాన్ చేస్తోంది సామ్.