మాజీ ప్రేమికుడి గురించి సమంత ఏమందంటే!

samantha sensational comments on siddharth
Highlights

అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకున్న సమంతా గతంలో నటుడు సిద్ధార్థ్ ను ప్రేమించిన

అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకున్న సమంతా గతంలో నటుడు సిద్ధార్థ్ ను ప్రేమించిన సంగతి తెలిసిందే. సిద్ధార్థ్ ను పెళ్లి కూడా చేసుకోవాలనుకుంది కానీ కొన్ని కారణాల వలన వీరిద్దరూ విడిపోయారు. ఎవరి జీవితాల్లో వారు బిజీ అయిపోయారు. ఆ తరువాత ఈ విషయానికి సంబంధించి అటు సిద్ధూ కానీ ఇటు సమంత కానీ మాట్లాడిన సందర్భాలు లేవు. ఇక సమంత.. అక్కినేని నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న తరువాత సిద్ధూ సంగతి అందరూ పూర్తిగా మర్చిపోయారు.

ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఆశ్చర్యకరంగా సిద్ధార్థ్ పై సంచలన కామెంట్స్ చేసింది సమంతా. ''సావిత్రి కథ తెలిసిన తరువాత నా జీవితంలానే అనిపించింది. ప్రేమ విషయంలో నేను కూడా అలానే నమ్మాను కానీ అదృష్టం కొద్దీ తప్పించుకున్నాను. లేదంటే నా లైఫ్ కూడా సావిత్రిలానే అయ్యేదేమో.. ఆ బాధ నుండి త్వరగానే బయటపడ్డాను. నేను చేసుకున్న పుణ్యం కొద్దీ నాకు చైతు దొరికాడు'' అంటూ చెప్పుకొచ్చింది. 

సమంతా వ్యాఖ్యలను బట్టి ఆమె జెమినీ గణేశన్ ను సిద్ధూతో పోల్చిందన్నమాట. మరి ఈ మాటలు సిద్ధూ వింటే ఏం అంటాడో చూడాలి!

loader