Samantha Special Song: ట్రోల్స్ చేస్తున్నా.. నవ్వుతూ స్పందించిన సమంత..
ఎట్టకేలకు స్పెషల్ సాంగ్ గురించి స్పందించింది సమంత. పుష్పలో తాను చేసిన ఊ అంటావా మావ సాంగ్ వివాదంపై… ఇప్పటి వరకూ మౌనంగా ఉన్న స్టార్ హీరోయిన్.. ఈమధ్యే పెదవి విప్పింది.
ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 17న రిలీజ్ అయ్యింది పుష్ప(Pushpa) మూవీ. సినిమా పర్వలేదు అనిపించినా.. కలెక్షన్స్ పరంగా మాత్రం మోత మెగించేస్తుంది. అల్లు అర్జున్(Allu Arjun) – రష్మిక(Rashmika) జంటగా.. సుకుమార్(Sukumar) డైరెక్ట్ చేసిన ఈమూవీని మైత్రీమూవీస్ బ్యానర్ పై నిర్మించారు. రెండు భాగాలుగా తెరకెక్కిన పుష్ప్ మూవీ.. ఫస్ట్ పార్ట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా సమంత స్పెషల్ సాంగ్ ను ఆడ్ చేశారు మేకర్స్. అనుకున్నట్టుగానే ఈ సాంగ్ సూపర్ గా పేలింది. యూత్ లో మంచి క్రేజ్ కూడ వచ్చింది.
పుష్ప మూవీలో సమంత(Samantha) సాంగ్ ఎంత అద్భుతంగా వర్కౌట్ అయ్యిందో ... అంతే కాంట్రవర్సీ కూడా అయ్యింది. ఊ అంటావా మావా.. ఊహూ అంటావా అంటూ.. పాటకు తగ్గట్టు సమంత ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ కు ఆడియన్స్ పిచ్చెక్కిపోయరు. అయితే ఈ పాటలో కొన్ని లిరిక్స్ గురించి వివాదం చెలరేగింది. పురుషులను అవమానించేలా కొన్ని పదాలు ఉన్నాయంటూ.. పురుష సంఘాలు మండిపడ్డాయి. “మీ మగబుద్ది వంకర బుద్ది “అంటూ వచ్చే పదాలపై వివాదం చెలరేగింది.
తెలుగు స్టేట్స్ లో పురుష సంఘంతో పాటు.. తమిళనాడు పురుష సంఘం కూడా ఈ పాట గురించి అభ్యంతరం చెపుతూ.. వివాదంపై కోర్టుకు వెళ్ళాయి. అటు కుర్రకారును ఉర్రూతలూగిస్తున్న ఈ పాట సోషల్ మీడియాలో దూసుకుపోతుండగా.. ఈ వివాదం చెలరేగడంతో.. ఇంకా పబ్లిసిటీ వచ్చి.. ఈపాట వైరల్ గా మారింది. అయితే ఈ కాంట్రవర్సీ గురించి మొన్నటి వరకూ అల్లు అర్జున్, డైరెక్ట్ సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్(Devisri Prasad) స్పందించారు కాని.. సమంత మాత్రం నోరు విప్పలేదు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం పై స్పందించారు సమంత.
— Samantha (@Samanthaprabhu2) December 19, 2021
ముందుగా ఈ సాంగ్ లో చేసినందకు చాలా హ్యాపీగా ఉందన్న హీరోయిన్..ఈ సాంగ్ ఈరేంజ్ లో పాపులర్ అవుతున్నందకు ఖుషీ అయ్యింది. ఇందలో బన్నీతో కలిసి పోటా పోటీగా డాన్స్ చేశానన్నారామె. ఇప్పుడు వస్తున్న వివాదాలన్ని పిచ్చితనం అంటూ కొట్టిపారేసింది సమంత. తే కాదు తన పాట గురించి సోషల్ మీడియాలో వస్తున్న మీమ్స్ గురించి కూడ స్పదించారు. వాటిని బాగా ఎంజాయ్ చేస్తాన్నారు. ఇటువంటి కొన్ని మీమ్స్ ను తన సోషల్ మీడియలో కూడా శేర్ చేస్తూ... నవ్వు ఎమ్మోజీని జత చేశారు సమంత.
Also Read : స్టార్ హీరోలంతా షూటింగ్స్ లో బిజీ.. ఎవరెక్కడ ఉన్నారో తెలుసా...?