సమంత ఆ హీరోతో కలిసి డైరెక్టర్ ని తిట్టుకుందా..?

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 1, Sep 2018, 2:30 PM IST
samantha, rahul raveendran's funny conversation
Highlights

అక్కినేని సమంత ప్రధాన పాత్రలో రూపొందుతోన్న చిత్రం 'యూటర్న్'. ఈ సినిమాలో సమంతతో పాటు ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక కీలకపాత్రల్లో నటిస్తున్నారు. 

అక్కినేని సమంత ప్రధాన పాత్రలో రూపొందుతోన్న చిత్రం 'యూటర్న్'. ఈ సినిమాలో సమంతతో పాటు ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక కీలకపాత్రల్లో నటిస్తున్నారు. కన్నడలో ఘన విజయం అందుకున్న 'యూటర్న్' సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. టైటిల్ గా కూడా అదే పేరుని కంటిన్యూ చేశారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

సెప్టెంబర్ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరం చేసింది. ఈ సందర్భంగా చెన్నైలో ఏర్పాటు చేసిన ఓ విలేకర్ల సమావేశంలో సమంతతో పాటు చిత్రబృందం పాల్గొంది. ఈ ప్రెస్ మీట్ లో సమంతకి రాహుల్ రవీంద్రన్ ఏదో చెబుతున్నట్లుగా కనిపిస్తోన్న ఫోటోని పోస్ట్ చేసి ఓ అభిమాని రాహుల్ ని సమంతతో ఏం మాట్లాడుతున్నారంటూ ప్రశ్నించారు.

దీనికి స్పందించిన రాహుల్.. 'ప్రీక్లైమాక్స్ సన్నివేశంలో ఎంత అద్భుతంగా నటించావు సమంత.. నీ ఫ్యాన్స్ కి ఇది బాగా నచ్చుతుందని' తనతో చెప్పాను అని రాహుల్ అన్నాడు. ఇది చూసిన సమంత.. 'లేదు నువ్వు నాకు చెప్పింది అది కాదు.. మనం డైరెక్టర్ పవన్ ని తిట్టుకున్నాం' అంటూ సరదాగా ట్వీట్ చేసింది. 

 


ఇది కూడా చదవండి.. 

చెన్నై రోడ్లపై కూరగాయలు అమ్ముకున్న స్టార్ హీరోయిన్! 

loader