టాలీవుడ్ స్టార్ హీరోయిన్, అక్కినేని కోడలు సమంత చెన్నై రోడ్లపై కూరగాయలు అమ్మి అందరికీ షాక్ ఇచ్చింది. ఓ మంచి పని కోసమే ఆమె ఈ విధంగా చేసినట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా సమంతకి మంచి క్రేజ్ ఉంది.

హీరోయిన్ గా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సమాజసేవకు కూడా తన సమయాన్ని వెచ్చిస్తుంటుంది. ఇప్పటికే సొంతంగా 'ప్రత్యూష ఫౌండేషన్' అనే స్వచ్చంద సంస్థను స్థాపించి, ఎందరో చిన్నపిల్లలకు, మహిళలకు అండగా నిలుస్తోంది సమంత. తాజాగా ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో స్వయంగా కూరగాయలు అమ్ముతూ కెమెరాలకు చిక్కారు సమంత.

ఈ మొత్తాన్ని మానసిక వికలాంగులుగా ఉన్న పిల్లలకు అలానే జబ్బులతో బాధపడుతున్న పిల్లల వైద్యానికి ఉపయోగించనున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన 'యూటర్న్' అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. 

ఇది కూడా చదవండి.. 

ఆ హీరోయిన్ కూరగాయలు అమ్ముకుంటోంది!