Asianet News TeluguAsianet News Telugu

సమంత పోస్ట్ చేసిన ఈ ఫోటో వైరల్... ఇంతకీ ఎవరీమె?

  • ఇటీవలే గోవాలో వివాహం జరుపుకున్న సమంత, నాగచైతన్య
  • వివాహానంతరం చెన్నైలో రిసెప్షన్ ఏర్పాటు చేసిన దగ్గుబాటి సురేష్
  • రిసెప్షన్ లో తనతో రానా సోదరి మాళవిక కలిసి వున్న ఫోటో షేర్ చేసిన సమంత
samantha photo with daggubati rana sister malavika gone viral

అక్కినేని వారి కోడలు.. నాగచైతన్య సతీమణి సమంత అక్కినేని సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సంగతి తెలిసిందే. తమ సినిమాల గురించే కాకుండా తన లైఫ్ కు సంబంధించిన ఎన్నో పర్సనల్ విషయాలు కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేేసుకోవడం సమంతకు అలవాటు. తన పెళ్లి వేడుక ఎంత వైభవంగా జరిగిందో చూశాం. ఇక అదలావుంటే... సమంత రీసెంట్ గా తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన ఫోటో సినీ సర్కిల్‌లో హాట్ టాపిక్ అయ్యింది.

 

తన రిసెప్షన్‌ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ఈ ఫోటోలు ఉన్నది చాలా స్పెషల్, ఆమె తనకు చాలా దగ్గర మాత్రమే కాదు చాలా మంచి వ్యక్తని మెచ్చుకుంటూ ఫోటోను షేర్ చేసింది. ఇంతకీ ఈ ఫోటోలోని ఉన్నది ఎవరో కాదు దగ్గుబాటి రామానాయుడు మనవరాలు, సురేష్ కుమార్తె , రానా సోదరి మాళవిక.



సమంత-నాగ చైతన్య వివాహం అనంతరం దగ్గుబాటి సురేష్ బాబు ఇటీవల చెన్నైలో ఒక పార్టీని ఏర్పాటు చేశారు ఈ పార్టీకి అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన అందరూ పాల్గొన్నారు. ఆ రిసెప్షన్ లో రానా సోదరి మాళవిక కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమంతతో కలిసి తీసుకున్న ఫోటో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. సినీ లైఫ్‌కి దూరంగా ఉండే మాళవిక... అక్కినేని సమంతతో కలిసి ఫోటో దిగడం.. దాన్ని ఆమె షేర్ చేయడంతో... సమంతకు ఇంత స్పెషల్ వ్యక్తి ఎవరబ్బా అని అభిమానులు ఆరా తీయగా... ఆమె రానా చెల్లెలు అని తెలియడంతో ఒక్కసారి రానా, సమంత ఫ్యాన్స్ లుక్కు మాళవిక వైపుకి మారింది. దీంతో ఈ ఫోటో నెట్టింట వైరల్ అయ్యింది.

Follow Us:
Download App:
  • android
  • ios