అక్టోబర్ 6న సమంత నాగ చైతన్యల వివాహ వేడుక గోవాలో వివాహ వేడుక జరిపేందుకు నిర్ణయం 100 మంది అత్యంత సన్నిహితుల నడుమ జరగనున్న వివాహం
జనవరి 29న ఎంగేజ్ మెంట్ జరుపుకున్న టాలీవుడ్ హాట్ కపుల్ నాగచైతన్య, సమంతలు అక్టోబర్ 6న వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. ఈ వివాహ వేడుక తేదీని ఇప్పటికే నాగార్జున ఫ్యామిలీ సహా వరుడు చైతన్య కూడా అధికారికంగా ప్రకటించాడు.
ఈ వేడుక డెస్టినీ మ్యారేజ్ ఈవెంట్ అని,, ఎక్కడో ఇటలీలో జరుగుతుందని, అఖిల్ కోసం ప్లాన్ చేసిన వెన్యూలోనే చైతన్య శామ్ ల పెళ్లి వేడుక జరుగుతుందని గత కొంత కాలంగా రూమర్స్ వినిపించాయి. అయితే తాజాగా ఈ హాట్ కపుల్ పెళ్లికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ లైన్ లోకి వచ్చింది.
నాగ చైతన్య, సమంత ల పెళ్లి వేడుక జరిగేది గోవాలోనని తెలుస్తోంది. అక్కినేని కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ఓ సినీ పరిశ్రమ పర్సనాలిటీ ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ పెళ్లి వేడుక గోవాలోని ఓ సుందరమైన బీచ్ రిసార్ట్ లో జరగనుందని తెలుస్తోంది. హిందూ సాంప్రదాయంతోపాటు, క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం ఈ పెళ్లి వేడుక జరుగుతుందని తెలుస్తోంది.
ఇక అంగరంగ వైభవంగా నిర్వహించ తలపెట్టిన ఈ పెళ్లి వేడుకలో దాదాపు 100 మంది అక్కినేని కుటుంబానికి సమీప బంధువవులతోపాటు, ఇరువురికి సంబంధించిన క్లోజ్ ఫ్రెండ్స్ హాజరుకానున్నారని సమాచారం. మొత్తానికి అక్టోబర్ లో ఒకటవబతతున్న నాగ చైతన్య, సమంతలు పెళ్లి కోసం భారీ ప్లాన్స్ వేశారు. పెళ్లి సంబరాల కోసం తర్వాత హనీమూన్ కోసం ఇద్దరూ 40 రోజులపాటు సినిమా షూటింగ్ లు, ఇతరత్రా సినిమా పనులన్నీ పక్కనబెట్టి అన్యోన్యంగా,, సరదాగా గడిపేందుకు ప్లాన్ చేసుకున్నారని తెలుస్తోంది.
