లండన్ లో హనీమూన్ లో వున్న చైసామ్.. రాగానే షూటింగ్స్

First Published 28, Oct 2017, 12:04 AM IST
samantha naga chaitanya enjoying honeymoon in london
Highlights
  • ఇటీవలో ఒక్కటైన టాలీవుడ్ హాట్ కపుల్ చైతూ,సమంత
  • వివాహ వేడుక అనంతరం లండన్ లో హనీమూన్ కు వెళ్లిన జంట
  • హనీమూన్ పీరియడ్ అనంతరం తిరిగి షూటింగులు

టాలీవుడ్‌ హాట్ అండ్ లేటెస్ట్ కపుల్ చైతూ-సమంతలు ప్రస్తుతం లండన్‌లో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ తర్వాత చైతూ, సమంత ఇద్దరూ అక్కడి నుంచి స్కాట్లాండ్ వెళ్లనున్నారు. స్కాట్లాండ్ ట్రిప్‌తో హనీమూన్ పూర్తి చేసుకున్న అనంతరం ఇద్దరూ మళ్లీ తమ తమ షూటింగ్స్‌ తో బిజీ కానున్నారు.

 

సమంత ప్రస్తుతం రామ్ చరణ్ సరసన రంగస్థలం 1985 అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. హనీమూన్ పూర్తి కాగానే సామ్ ఇండియాకు తిరిగొచ్చేసి రంగస్థలం షూటింగ్‌కి హాజరుకానుంది.

 

ఇక చైతూ పరిస్థితి కూడా అంతే. సామ్‌తో హనీమూన్ పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగొచ్చిన తర్వాత తన అప్‌కమింగ్ చిత్రాల షూటింగ్‌తో చైతూ బిజీ కానున్నాడు.

loader