సమంతా పెళ్లి వీడియో.. ఫ్యాన్స్ కు సర్ప్రైజ్!

samantha marriage video
Highlights

ఫ్యాన్స్ కు సమంతా సర్ప్రైజ్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటుడు అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా తన పెళ్లి వీడియోను అభిమానులకు షేర్ చేసి సర్ప్రైజ్ చేసింది సమంతా. గతేడాది అక్టోబర్ 6న గోవాలో వీరి వివాహం జరిగింది.

ఆ తరువాత ఇద్దరూ సినిమాలలో బిజీ అయిపోయారు. అయితే తన అభిమానులకు చేసిన ప్రామిస్ ను మాత్రం మర్చిపోలేదు సమంతా. 'మీకు ప్రామిస్ చేసినట్లుగానే చై-సామ్ ప్రపంచంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా' అని చెబుతూ ఆ వీడియో రూపొందించిన 'స్టోరీస్ బై జోసెఫ్ రాధిక్' లకు థాంక్స్ చెప్పింది.

మీరు దేశంలోనే బెస్ట్ అంటూ పోగిడేసింది. ఈ వీడియోలో సమంత, చైతు;అ డాన్సులు., నాగార్జున సంబరాలు మొదలైన వాటిని కవర్ చేస్తూ ఆసక్తికరంగా చిత్రీకరించారు. ఆ వీడియో ఎలా ఉందో మీరు కూడా చూడండి!

 

loader