నిజానికి అక్కడ సమంత లేదు.. కానీ.. ఉన్నట్లు చూపించారు

samantha marfing photo in akkineni family photo goes viral
Highlights

అంతా ఫోటోషాప్ మాయ

టాలీవుడ్ నవ మన్మధుడు నాగార్జున- అమలు సోమవారం తమ 25వ పెళ్లి రోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ప్రత్యేకంగా విందు ఏర్పాట్లు చేసి.. కుటుంబసభ్యులతో ఆనందాన్ని పంచుకున్నారు.  ఈ వేడుకకు సంబంధించిన రెండు ఫోటోలను వారి ముద్దుల కుమారుడు అఖిల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ ఫోటోలు నెట్టింట హల్ చల్ చేశాయి. ఫ్యామిలీ అంతా ఒకేచోట కనిపించడంతో అక్కినేని అభిమానులంతా సంబరపడిపోయారు కూడా.  అయితే... ఒక చిన్న లోటు అభిమానులను నిరాశకు గురిచేసింది.  ఆ ఫోటోలో నాగార్జున, అమల, నాగచైతన్య, సుశాంత్‌, సుమంత్, అఖిల్‌  ఇలా ఇతర కుటుంబసభ్యులంతా ఉన్నారు. కానీ అక్కినేని పెద్ద కోడలు, స్టార్ హీరోయిన్ సమంత లేదు.

 

దీంతో.. అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. అయితే.. ఆ లోటుని సమంత అభిమాని ఒకరు తీర్చేశారు.  ఫోటో షాప్ లో ఆ ఫోటోలో సమంత ఉన్నట్లు క్రియేట్ చేసి.. ట్విట్టర్ వేదికగా సమంతకు షేర్ చేశారు. ఇప్పుడు ఈ ఫోటోలో అక్కినేని సమంత కూడా ఉందంటూ క్యాప్షన్ జోడించారు. కాగా.. ఆ ఫోటోని చూసిన సమంత.. ఆనందం వ్యక్తం చేశారు. ఆ అభిమాని ట్వీట్ కి హార్ట్ సింబల్స్ తో రిప్లై కూడా ఇచ్చారు. 

loader