పీకేసింది...

First Published 2, Jan 2018, 7:44 PM IST
samantha kicks tamannah in brand endorsments
Highlights
  • బ్రాండ్ ఎండోర్స్ మెంట్స్ తో రెండు చేతులా సంపాదిస్తున్న హిరోయిన్స్
  • గత కొంత కాలంగా తెలుగులో పలు బ్రాండ్స్ ప్రచార కర్తగా జోరు నడిపించిన తమన్నా
  • తాజాగా ఎండోర్స్ మెంట్స్ లో దూసుకెళ్తున్న సమంత, కాజల్

సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా... సెలెబ్రిటీలు బ్రాండ్ ఎండోర్స్ మెంట్స్ తో తెగ క్యాష్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా హిరోయిన్స్ తమ అందంతో కొన్ని స్పెషల్ యాడ్స్ కి మరింత అందాన్ని తెస్తున్నారు. హీరోలు బ్రాండ్ అంబాసిడర్స్ గా ఎంత సంపాదిస్తున్నారో తెలియదు గాని హీరోయిన్స్ మాత్రం గట్టిగా సంపాదించేస్తున్నారు. ఏ మాత్రం గ్యాప్ లేకుండా వివిధ కంపెనీలకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తూ హీరోయిన్స్ తెగ హల్ చల్ చేస్తున్నారు.

 

టాలీవుడ్ హిరోయిన్ తమన్నా ఇటీవల వరకు చాలా యాడ్స్లో నటించింది. మొత్తంగా కొన్నేళ్ల వరకు బడా కంపెనీలతో బ్రాండ్ అంబాసిడర్ గా ఒప్పందాలను కుదుర్చుకుంది. అయితే ఈ మధ్య జోరు తగ్గిందనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే ఆమెకు పోటీగా సమంత, కాజల్ దూసుకెళ్తున్నారు. అయితే రీసెంట్ గా మిల్కీ బ్యూటీ కనిపించాల్సిన ఒక యాడ్ లో సమంత కనిపించేసింది. ప్రముఖ తెలుగు ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ జీ తెలుగు ఛానల్ కి గత కొంత కాలంగా తమన్నా బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేది. ఆ స్థానంలోకి సమంత వచ్చిన సంగతి తెలిసిందే.

 

అయితే సడన్ గా తమన్నా ప్లేస్ ను సమంత దక్కించుకోవడంతో ఇప్పుడు మిల్కీ బ్యూటీ రేంజ్ తగ్గిందా.. అనే ఫీలింగ్ క్రియేట్ అవుతోంది. ఇక సమంత విషయానికి వస్తే.. బ్రాండ్ అంబాసిడర్ గా సమంత ఉంటే కంపెనీ రేంజ్ తప్పకుండా పెరుగుతుంది అనే ఒక టాక్ బాగా వచ్చేసింది. దీంతో ఖర్చెక్కువైన పర్లేదు అని అక్కినేని కోడలిని సెలెక్ట్ చేశారేమో అని మరికొందరు చర్చించుకుంటున్నారు.

 

అలా తమన్నా పోస్టు నుంచి పీకేసి సమంత ఆ విధంగా ఛాన్స్ దక్కించుకుందన్నమాట. 

loader