సమంత సంతోషానికి కారణమైన ఆ మూడు!

First Published 12, May 2018, 12:36 PM IST
samantha is excited with her hat trick hits
Highlights

పెళ్లి చేసుకుంటే ఇక హీరోయిన్లుగా సినిమా అవకాశాలు రావడం కష్టమని

పెళ్లి చేసుకుంటే ఇక హీరోయిన్లుగా సినిమా అవకాశాలు రావడం కష్టమని, కెరీర్ అక్కడితో ఆగిపోతుందనే నిర్ణయానికి వచ్చేస్తారు. అవన్నీ కేవలం అపోహలు మాత్రమే.. ప్రతిభకు పెళ్ళితో సంబంధమే లేదని నిరూపించింది నటి సమంత అక్కినేని. గతేడాది నాగచైతన్యను వివాహం చేసుకున్న సమంత ఓ పక్క నటిగా సినిమాలు చేస్తూనే మరోపక్క తన కుటుంబానికి సమయాన్ని కేటాయిస్తోంది. అంతేకాదు తన భర్తతో ఎంతో సంతోషంగా ఉంటూ కపుల్ గోల్స్ సెట్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ మూడు ఘన విజయాలను సొంతం చేసుకొని మరోసారి వార్తల్లో నిలిచింది.

ఈ ఏడాది మార్చి నెలలో విడుదలైన 'రంగస్థలం' సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకుంది సమంత. ఈ సినిమాలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. లేటెస్ట్ గా విడుదలైన 'మహానటి' సినిమాలో సమంత జర్నలిస్ట్ పాత్రలో సరికొత్త లుక్ తో ఆకట్టుకుంది. తాజాగా ఆమె నటించిన తమిళ చిత్రం 'ఇరుంబు తిరై' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై ఉన్న అంచనాలను అందుకోవడంలో పూర్తిగా సక్సెస్ అయింది చిత్రబృందం. సమంత పాత్రకు సైతం మంచి గుర్తిపు వచ్చింది.

ఈ మూడు విజయాలతో ఎంతో సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేసింది సమంత. తనకు ఉత్తమమైన వేసవిని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది. 

 

loader