సమంత జోక్యం.. నాగార్జునకు షాక్!

samantha involvement in naga chaitanya's films
Highlights

ఈ జోక్యం ఇంతటితో ఆగదని, చైతు సినిమాల విషయంలో కూడా సమంత ఇప్పటినుండే కేర్ తీసుకుంటుందని చెబుతున్నారు. ఇప్పటివరకు చైతు సినిమాలకు సంబంధించి నిర్ణయాలన్నీ తన తండ్రి నాగార్జునకు వదిలేసేవాడు.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి సమంత.. నాగచైతన్యను వివాహం చేసుకున్న తరువాత కూడా హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. మొన్నామధ్య ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పనుందనే వార్తలు వినిపించాయి. కానీ అందులో నిజం లేదని చెప్పేశాడు నాగచైతన్య. సమంత వ్యవహారం చూస్తుంటే ఇంకొంతకాలం హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ 'యూటర్న్' కన్నడ రీమేక్ సినిమాలో నటిస్తోంది. తెలుగు కూడా అదే టైటిల్ తో సినిమాను విడుదల చేయనున్నారు.

ఈ సినిమాను పవన్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. సినిమాలో లీడ్ క్యారెక్టర్ పోషిస్తోన్న సమంతనే సినిమా విషయాలు కూడా దగ్గరుండి చూసుకుంటుందని టాక్. మేకింగ్, ప్రమోషన్ వ్యవహారాలు తన గ్రిప్ లోనే ఉంచుకుందట. టీమ్ తన ప్రమేయం లేకుండా ఏం చేయడం లేదని సమాచారం. ఆమె ఇచ్చే సలహాలు, సూచనలను యూనిట్ సభ్యులు క్రమ తప్పకుండా పాటిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై విడుదలవుతోన్న 'చిలసౌ' సినిమా ప్రమోషన్స్ లో కూడా అమ్మడి ఫింగరింగ్ ఎక్కువైందని టాక్.

సుశాంత్ కు సంబంధించిన ఓ ప్రమోషనల్ వీడియో బయటకు రావడానికి కూడా సమంతనే కారణమని చెబుతున్నారు. ఈ జోక్యం ఇంతటితో ఆగదని, చైతు సినిమాల విషయంలో కూడా సమంత ఇప్పటినుండే కేర్ తీసుకుంటుందని చెబుతున్నారు. ఇప్పటివరకు చైతు సినిమాలకు సంబంధించి నిర్ణయాలన్నీ తన తండ్రి నాగార్జునకు వదిలేసేవాడు. కానీ ఇప్పుడు సమంత జోక్యం చేసుకుంటుందని టాక్. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చైతు కూడా తన సినిమా కథలు సమంత వింటుందని చెప్పాడు. సో ఇక నాగార్జునకు విరామం దొరికినట్లే!

loader