వ్యక్తిగత జీవితంలో ఒడిడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ సమంత కెరీర్ పరంగా దూసుకుపోతోంది. నాగ చైతన్యతో వివాహం తర్వాత కూడా సమంత జోరు తగ్గలేదు. రంగస్థలం, ఓ బేబీ లాంటి చిత్రాలతో సమంత మెస్మరైజ్ చేసింది.
వ్యక్తిగత జీవితంలో ఒడిడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ సమంత కెరీర్ పరంగా దూసుకుపోతోంది. నాగ చైతన్యతో వివాహం తర్వాత కూడా సమంత జోరు తగ్గలేదు. రంగస్థలం, ఓ బేబీ లాంటి చిత్రాలతో సమంత మెస్మరైజ్ చేసింది. క్రేజీ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంత పాత్రకు దేశ వ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. సౌత్ లో తిరుగులేని స్టార్ గా ఎదిగిన సమంత.. ఫ్యామిలీ మ్యాన్ 2తో సమంత ఇండియా వ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకుంది.
ఇప్పుడు Samantha హాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టబోతోంది. ఇటీవలే సమంత తొలి Hollywood చిత్రానికి ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ప్రఖ్యాత దర్శకుడు ఫిలిప్ జాన్ దర్శత్వంలో నటించబోతున్నట్లు సమంత ప్రకటించింది. దర్శకుడు జాన్ ఫిలిప్ ఓ నవల ఆధారంగా శృంగారం అంశంపై చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి 'ది అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్' అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర కోసం సమంతని ఎంచుకున్నారు.
ఓ బేబీ చిత్రానికి కో ప్రొడ్యూసర్ గా ఉన్న సునీత తాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆసక్తికర అంశం ఏంటంటే.. ఈ హాలీవుడ్ చిత్రం కోసం సమంతని Rana Daggubati రికమండ్ చేశాడట. ఈ చిత్రంలో ఎవరిని తీసుకోవాలని రానాని సునీత సలహా అడిగిందట. దీనితో రానా వెంటనే సమంత అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది అని రికమండ్ చేశాడు.
మరో ఆలోచన లేకుండా సమంతని కలసి కథ వినిపించాలని రానా సునీతకు సూచించాడు. ఆ తర్వాత సునీత.. సమంతని కలసి కథ వివరించడం జరిగింది. వెంటనే సమంత దర్శకుడు జాన్ ఫిలిప్ ని కలిసింది. ఆయన సమంతని ఈ చిత్రం కోసం ఫైనల్ చేశారు.
Also Read: BIMBISĀRA Teaser: నెత్తుటి ప్రవాహం సృష్టిస్తున్న కళ్యాణ్ రామ్.. ట్విస్ట్ అదిరిపోయింది
సమంత టాలెంట్ గురించి రానాకు బాగా తెలుసు. రానా, సామ్ మధ్య మంచి సాన్నిహిత్యం కూడా ఉంది. సమంత నటించిన ఓ బేబీ చిత్రానికి సురేష్ బాబు ప్రధాన నిర్మాత కాగా సునీత సహ నిర్మాతగా పనిచేసారు.
