రంగస్థలంలో లిప్ లాక్ పై క్లారిటీ ఇచ్చిన సమంత

First Published 10, Apr 2018, 3:21 PM IST
Samantha gives clarity on lip lock in rangasthalam
Highlights
రంగస్థలంలో లిప్ లాక్ పై క్లారిటీ ఇచ్చిన సమంత

సమంత కెరీర్ ఒక అద్భతం అనే చెప్పాలి. తను చేసిన సినిమాలు దాదాపు పెద్ద హిట్లు ఇండస్ట్రీ హిట్లు ఎక్కువే. తన కెరీర్ గ్రాఫ్ చూసుకుంటే ఇప్పుడున్న ఏ హీరోయిన్కి అన్ని హిట్స్ లేవు. హీరోయిన్లలో అత్యధిక 100 కోట్లు క్లబ్ ఉన్నది సమంత మాత్రమే. రంగస్థలం మరో హిట్ అందుకున్న శామ్ ఇప్పుడు ఆమె గురించి ఒక హాట్ టాపిక్ నడుస్తుంది. అదేమిటంటే రంగస్థలం ప్రీ క్లైమాక్స్ లో చరణ్ కి లిప్ లాక్ ఇవ్వడం దీన్ని అందరు తప్పుపడుతున్నారు. అదే విషయాన్ని సమంతని అడిగితే ఇలా సమాధానం చెప్పింది.

 ‘‘పెళ్లయిన హీరోలు చాలా మంది లిప్ లాక్ సీన్లు చేస్తూనే ఉన్నారు. కానీ ఈ సీన్ ఎందుకు చేశావని వాళ్లను ఎందుకు అడగరు? సుకుమార్ ఈ సీన్  నెరేట్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. ఆ సీన్ లో హీరోకు ముద్దు ఇవ్వడం కరెక్టని అనుకున్నాకే దర్శకుడికి ఓకే చెప్పాను. కానీ అందరూ అనుకుంటున్నట్లు చరణ్ పెదవులపై ముద్దు పెట్టలేదు. నేను ముద్దు పెట్టింది బుగ్గలపై మాత్రమే. అది లిప్ లాక్ అనిపించడం కేవలం కెమెరా ట్రిక్’’ అంటూ శామ్ క్లారిటీ ఇచ్చింది. 

loader