వివాహ బంధంతో ఒక్కటైన సమంత, నాగచైతన్య వివాహం తర్వాత కన్నీళ్లు పెట్టుకున్న సమంత శనివారం క్రిస్టియన్ పద్ధతిలో చైసామ్ వెడ్డింగ్ తాళి కట్టిన సందర్భంలో సమంత కంటతడిపెట్టగా భైరవ్ నవ్వినట్లు మార్పింగ్ ఫోటో వైరల్
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత.. అక్కినేని వారింటి కోడలయ్యింది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న అక్కినేని వారసుడు నాగచైతన్య, సమంతలు శుక్రవారం వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. వారి పెళ్లి ఫోటోలను నాగార్జున సోషల్ మీడియా వేదికగా అభిమానులకు షేర్ చేశారు. నవవధువులు ఎంత సంతోషంగా, నవ్వుతూ తుళ్లుతూ పెళ్లి చేసుకున్నారో.. ఆ ఫోటోలు చూస్తే అర్థమైపోతుంది.

అయితే.. వివాహం తర్వాత సమంత కన్నీళ్లు పెట్టుకుందట. పెళ్లి తర్వాత ఏ ఆడపిల్లకైనా అత్తారిల్లే సొంతిల్లు. పుట్టి పెరిగిన పుట్టినింటికి కూడా చుట్టపు చూపుగా వెళ్లాల్సి వస్తుంటుంది అందుకే అప్పగింతల సమయంలో ఆడపిల్లలు ఏడ్చేస్తుంటారు. ఎంతటి స్టార్ హీరోయిన్ అయినా.. సమంత కూడా ఒక ఆడపిల్లే కదా.. అందుకే వివాహం తర్వాత కన్నీళ్లు పెట్టుకుందట. అయితే ఆ కన్నీళ్లు.. తల్లిదండ్రులను దూరమౌతున్నందుకో లేదా.. కోరుకున్నవాడు దక్కినందుకు సంతోషంతో వస్తున్న ఆనంద భాష్పాలో. ఏదేమైనా ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఇదిలా ఉంటే.. సమంత ఏడ్చే ఫోటోని సోషల్ మీడియాలో ఫన్నీ చేస్తున్నారు. స్పైడర్ సినిమాలో ఎస్ జే సూర్య విలన్ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ఎస్ జే సూర్య కి ఎవరైనా ఏడిస్తే.. సంతోషం. ఇప్పుడు సమంత ఏడుస్తున్న ఫోటోలో ఆయన ఫోటో పెట్టి నవ్వుతున్నట్లుగా మార్ఫింగ్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే నెటిజన్లు మాత్రం ఆ ఫోటోకి కౌంటర్లు ఇస్తున్నారు. సమంత బాధతో ఏడ్వడం లేదని.. సంతోషంతో ఏడుస్తోందంటూ కామెంట్లు చేస్తున్నారు.
