క్యాస్టింగ్ కౌచ్ గురించి సమంత ఏమందో తెలుసా.?

Samantha comments on casting couch
Highlights

క్యాస్టింగ్ కౌచ్ గురించి సమంత ఏమందో తెలుసా.?

గత కొన్ని నెలలుగా క్యాస్టింగ్ కౌచ్ గురించి హీరోయిన్లు బహిరంగంగా వాళ్ల అనుభవాలు తెలియచేస్తున్న విషయం తెలిసిందే. శ్రీరెడ్డి కూడా క్యాస్టింగ్ గురించి పోరాటం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అది నీరుగారిపోయిన విషయం కూడా విదితమే. ఈ క్రమంలో పలువురు సెలబ్రెటీలు కాస్టింగ్ కౌచ్ గురించి తమ అభిప్రాయాలు వెల్లడించారు. తాజాగా సమంత  సైతం ఈ అంశంపై ఓపెన్ అయింది.

కాస్టింగ్ కౌచ్ అనేది కేవలం సినీ పరిశ్రమకు మాత్రమే పరిమితం కాదంటూ అందరూ చెప్పే మాటనూ సమంత కూడా చెప్పింది. తాను ఒక్కొక్కరి గురించి స్పందించలేనని.. ప్రతి రంగంలోనూ కొందరు చెడ్డ వ్యక్తులు ఉంటారని సమంత అంది. తాను గత ఎనిమిదేళ్లుగా తెలుగు.. తమిళ సినీ పరిశ్రమల్లో పని చేస్తున్నాని.. తన తొలి సినిమానే పెద్ద విజయం సాధించడంతో తనకు ఎప్పుడూ ఎక్కడా ఇబ్బంది తలెత్తలేదని ఆమె స్పష్టంచేసింది. సినీ పరిశ్రమలో ఎన్నో మంచి విషయాలు జరుగుతుంటాయని.. తనకీ ఇండస్ట్రీ అంటే చాలా చాలా ఇష్టమని.. ఇక్కడే తాను ఎందరో మంచి.. గొప్ప వ్యక్తుల్ని కలిశానని సమంత అంది. 

loader