రీసెంట్ గా గోవాలో వివాహ బంధంతో ఒక్కటైన సమంత చైతూ ఇప్పటి వరకూ జరగని యువ స్మ్రాట్ చై-సామ్ రిసెప్షన్ త్వరలోనే రిసెప్షన్ అని ఊరిస్తున్న అక్కినేని వారు(నాగార్జున) మరోవైపు చెన్నైలో రిసెప్షన్ నిర్వహించిన దగ్గుబాటి ఫ్యామిలీ?
తెలుగు ఇండస్ట్రీలో ఇటీవల అందర్నీ ఆకట్టుకున్న జంట సమంత-నాగచైతన్య. గోవాలో ఈ నెల 6,7 తేదీల్లో రెండుసార్లు పెళ్లి చేసుకున్న చైతూ సామ్ జంల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అక్కినేని ఫ్యామిలీ నుంచి వారసునిగా వచ్చిన నాగ చైతన్య.., ‘ ఏం మాయ చేశావే’ చిత్రంతో పరిచయం అయిన సమంత రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ప్రేమించాడు. పెద్దలను ఒప్పించి చాలా గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నాడు.
ఈ వివాహానికి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు చాలా తక్కువ మందే హాజరయ్యారు. త్వరలో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నట్లు అక్కినేని నాగార్జున అడిగినప్పుడల్లా చెప్తున్నారు. మరి చేస్తున్నారో లేదో తెలియదు కానీ.. సమంత చైతూలు మాత్రం అసలు రిసెప్షన్ కూడా వద్దన్నారట. నాగార్జున మాత్రం ఇద్దరిని కొత్త పెళ్లి మోజు తీరిందాకా వదిలేసి.. తర్వాత గ్రాంజ్ గా రిసెప్షన్ చేసేస్తానని నాగార్జున అంటున్నారు.
ఓ వైపు నాగార్జున అలా చెప్తూ పోతుంటే.. తాజా సమాచారం ప్రకారం నాగ చైతన్య - సమంత రిసెప్షన్ చెన్నైలో గ్రాండ్ గా జరిగిందని తెలుస్తోంది. ఈ రిసెప్షన్ ప్రైవేట్‌గా జరిగిందని..దీన్ని దగ్గుబాటి ఫ్యామిలీ దగ్గరుండి మరీ జరిపించారని కోలీవుడ్ వర్గాల సమాచారం. స్టార్ ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేష్ బాబు, వెంకటేష్, రానా దగ్గరుండి చూసుకున్నారట.
పూర్తి ప్రైవేటు కార్యక్రమంలా జరిగిన ఈ రిసెప్షన్‌ను దగ్గుబాటి కుటుంబం ఏర్పాటు చేసిందిట. ఈ వేడుకకు దగ్గుబాటి కుటుంబ సభ్యులు, బంధువులు, అత్యంత సన్నిహితులు హాజరైనట్టు సమాచారం. రిసెప్షన్ కూడా పెళ్లి వేడుకలా గ్రాండ్ గా జరిగిందని తెలుస్తోంది.
ఇక మరో రిసెప్షన్ అక్కినేని నాగార్జున ఏర్పాటు చేయనున్నారు. ఈ రిసెప్షన్ హైదరాబాదులో జరగనుంది. దీనికి ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు. మరి ఇంకెన్నాళ్లో.. మన తెలుగు పరిశ్రమ వాళ్లందరికీ లెజెండ్ అక్కినేని ఫ్యామిలీ ఎప్పుడు విందు భోజనం పెడుతుందో చూడాలి.
