స్టార్ హీరోని నమ్ముకున్న సమంత, కీర్తి సురేష్ ఇద్దరికీ షాక్.. కోలుకోలేని దెబ్బ తగిలిందిగా
సమంత, కీర్తి సురేష్ ఇద్దరూ సౌత్ లో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్లు. సమంత అయితే ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తో ఇండియా మొత్తం క్రేజ్ సొంతం చేసుకుంది. మరోవైపు కీర్తి సురేష్ సౌత్ లో మహానటిగా సత్తా చాటింది.
సమంత, కీర్తి సురేష్ ఇద్దరూ సౌత్ లో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్లు. సమంత అయితే ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తో ఇండియా మొత్తం క్రేజ్ సొంతం చేసుకుంది. మరోవైపు కీర్తి సురేష్ సౌత్ లో మహానటిగా సత్తా చాటింది. అయితే ఈ ఏడాది సమంత, కీర్తి సురేష్ ఇద్దరికీ ఊహించని షాక్ తప్పలేదు. అది కూడా ఒకే హీరో వల్ల.
సమంత, కీర్తి సురేష్ ఇద్దరికీ ఫ్లాపులు
సమంత, కీర్తి సురేష్ ఇద్దరికీ ఈ ఏడాది డిజాస్టర్స్ ఎదురయ్యాయి. సమంత వరుణ్ ధావన్ తో కలసి సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ సిరీస్ కి ఆడియన్స్ నుంచి ఆశించిన రెస్పాన్స్ రాలేదు. సమంత యాక్షన్ తో అదరగొట్టింది కానీ సిరీస్ ఎంగేజింగ్ గా లేకపోవడంతో ప్రేక్షకులు రిజెక్ట్ చేసేశారు.
అదే హీరోతో కీర్తి సురేష్ రీసెంట్ గా బేబీ జాన్ చిత్రంలో నటించింది. తమిళంలో ఘన విజయం సాధించిన దళపతి విజయ్ తేరి చిత్రాన్ని హిందీలో బేబీ జాన్ పేరుతో రీమేక్ చేశారు. ఈ చిత్రంతోనే కీర్తి సురేష్ బాలీవుడ్ లోకి డెబ్యూ చేసింది. ఎన్నడూ లేనంతగా బేబీ జాన్ లో గ్లామర్ షో చేసింది. వరుణ్ ధావన్, కీర్తి సురేష్ ఈ చిత్రంలో జంటగా నటించారు.
తేరి రీమేక్ గా బేబీ జాన్
తేరి చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ అట్లీ.. బేబీ జాన్ చిత్రాన్ని నిర్మించారు. పెళ్లి తర్వాత కీర్తి సురేష్ నుంచి రిలీజ్ అయిన తొలి చిత్రం ఇదే. ఈ చిత్రానికి కీర్తి సురేష్ 4 కోట్ల భారీ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ బేబీ జాన్ చిత్రం ఆడియన్స్ కి ఏమాత్రం నచ్చలేదు. వరుణ్ ధావన్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ దిశగా ఈ చిత్రం పయనిస్తోంది. పెళ్ళయాక తొలి చిత్రమే డిజాస్టర్ కావడంతో కీర్తి సురేష్ బాలీవుడ్ దారులు మూసుకుపోయినట్లే అని అంటున్నారు.
సమంత కష్టం వృధా
సమంత అయితే మయో సైటిస్ నుంచి కోలుకుని ప్రాణం పెట్టి సిటాడెల్ లో నటించింది. ఆమె కష్టం పూర్తిగా వృధా అయింది. ఈ సిరీస్ లో పాపకి తల్లిగా సమంత నటించింది. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఈ సిరీస్ విజయం సాధిస్తే మునుపటి జోరు అందుకోవాలి అనుకున్న సమంత ఆశలు గల్లంతయ్యాయి.
వరుణ్ ధావన్.. సమంత, కీర్తి సురేష్ లకు బ్యాడ్ సెంటిమెంట్ గా మారిపోయాడు. తేరి రిలీజ్ అయిన 8 ఏళ్ళకి రీమేక్ చేయాలనుకోవడం పెద్ద మిస్టేక్. నార్త్ ఆడియన్స్ కూడా వివిధ ఫ్లాట్ ఫామ్స్ పై తేరి చిత్రాన్ని చూసేసి ఉంటారు. ఇటీవల కాలంలో రీమేక్ చిత్రాలు పెద్దగా ప్రభావం చూపడం లేదు.
ఇటీవలే వివాహ బంధంలోకి కీర్తి సురేష్
కీర్తి సురేష్ కి డిసెంబర్ నెల బిజీ బిజీగా సాగిపోయింది. డిసెంబర్ 12న కీర్తి సురేష్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఆమె బాలీవుడ్ డెబ్యూ చిత్రం బేబీ జాన్ కూడా రీసెంట్ గా విడుదలయింది. చిన్ననాటి స్నేహితుడు ఆంటోని తట్టిల్ ని పెళ్లి చేసుకుని కీర్తి సురేష్ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. 15 ఏళ్లుగా ఉన్న స్నేహాన్ని వీరిద్దరూ ప్రేమగా మార్చుకున్నారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో ఇద్దరూ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. గోవాలో పెళ్లి వేడుక గ్రాండ్ గా జరిగింది.
సమంత కొత్త చిత్రం ఎప్పుడు ?
పెళ్ళైన కొన్ని రోజులకే కీర్తి సురేష్ బేబీ జాన్ ప్రమోషన్స్ కోసం వచ్చేసింది. అంత కష్టపడినప్పటికీ కీర్తి సురేష్ కి మంచి ఫలితం దక్కలేదు. ఇక సమంత చేతిలో కూడా ప్రస్తుతం ఎక్కువ ఆఫర్స్ లేవు. సమంత చివరగా తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ఖుషి చిత్రంలో నటించింది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్, సమంత కెమిస్ట్రీ ఆకట్టుకుంది కానీ సినిమా నిరాశ పరిచింది. సమంత తదుపరి తెలుగులో ఎప్పుడు నటిస్తుందో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.