అక్కినేని సమంత రూల్స్ కి విరుద్ధంగా ఓ పని చేసి పోలీసులకు దొరికిపోయిందట. వారి నుండి తప్పించుకోవడానికి చాలాసేపు బ్రతిమిలాడిందట. ఈ విషయాన్ని స్వయంగా సమంత చెప్పుకొచ్చింది. అయితే ఇది ఇప్పటివిషయం కాదు.. సమంత చిన్నతనంలో సంగతి.

ఇటీవల 'యూటర్న్' సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సమంత తన చిన్ననాటి విషయాలను పంచుకుంది. ''నేను 11వ క్లాసులో ఉన్నప్పుడే నాన్నగారు స్కూటీ కొనిచ్చారు. దానిపై పల్లవరం ఇన్ సైడ్ వీధుల్లో మాత్రమే తిరగాలని వార్నింగ్ ఇచ్చారు. అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ తో పెద్దగా పనుండేది కాదు. దీంతో బాగా తిరిగేసేదాన్ని. ఓసారి ఎవరికీ చెప్పకుండా లైసెన్స్ లేకుండానే స్కూటీ మీద ఎయిర్ పోర్ట్ వరకు వెళ్లిపోయాను.

మధ్యలో పోలీసులు ఆపి లైసెన్స్ అడిగారు. ప్లీజ్.. ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేసుకొని అప్పటికప్పుడు ఎలాగో తప్పించుకున్నాను'' అంటూ చిన్నప్పటి సంగతులు చెప్పుకొచ్చింది. ఇక యూటర్న్ తో పాటు తమిళంలో ఆమె నటించిన 'సీమరాజా' కూడా విడుదలకు సిద్ధమవుతోంది. రెండు సినిమాలతో తమిళ ప్రేక్షకులను ఈమేరకు మెప్పిస్తుందో చూడాలి!


ఇది కూడా చదవండి.. 

సమంత ఆ హీరోతో కలిసి డైరెక్టర్ ని తిట్టుకుందా..?

చెన్నై రోడ్లపై కూరగాయలు అమ్ముకున్న స్టార్ హీరోయిన్!