టైగర్ జిందా హై సెకెండ్ సాంగ్..భలే రొమాంటిక్ గా వుంది

టైగర్ జిందా హై సెకెండ్ సాంగ్..భలే రొమాంటిక్ గా వుంది

బాలీవుడ్ లో సల్మాన్‌, కత్రినా జంటకున్న క్రేజ్‌ ఏంటో తెలిసిందే. వీరిద్దరు జోడీగా నటించిన తాజా చిత్రం ‘టైగర్‌ జిందా హై’. అలీ అబ్బాస్‌ జఫర్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలోని ‘స్వాగ్‌ సే కరేంగే..’ అనే పాటను ఫస్ట్ విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా రెండో పాటను విడుదల చేసింది.

 

‘దిల్‌ దియానా గల్లన్‌..’ అని సాగే ఈ పాటలో సల్మాన్‌, కత్రినాల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి. మంచు కొండలపై ఇంట్లో సల్మాన్‌, కత్రినా కనిపించారు. తెల్లటి మంచులో రంగులతో కత్రినా పెయింటింగ్‌ను సల్మాన్‌ వేశారు. ఈ చిత్రంతో వీరి జంట మరోసారి వెండితెరపై మాయ చేయడానికి సిద్ధమైపోయిందని చర్చ జరుగుతోంది.

 

సల్మాన్‌, కత్రినా ఐదేళ్ల తర్వాత కలిసి నటించిన టైగర్ జిందాహై చిత్రంలో టైగర్‌ పాత్రలో సల్మాన్, కత్రినా జోయా పాత్రలో కనిపించనున్నారు. డిసెంబరు 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 2012 సల్మాన్, కత్రినా జోడీగా రిలీజై బ్లాక్‌బస్టర్‌ గా నిలిచిన ‘ఏక్‌ థా టైగర్‌’ సినిమాకు సీక్వెల్‌గా రూపొందించిన చిత్రమిది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos