కేవలం నాలుగే రోజులకు రూ.247 కోట్లు

salman tiger zinda hai collections flow
Highlights

  • టైగర్ జిందాహై మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సల్మాన్ ఖాన్
  • ఈ మూవీలో సల్మాన్ ఖాన్ సరసన హిరోయిన్ గా కత్రినా కైఫ్
  • బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న టైగర్ జిందా హై

 

బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకడైన టైగర్ సల్మాన్ ఖాన్ మళ్లీ ఫామ్ లోకి వచ్చేశాడు. ‘ట్యూబ్ లైట్’ మూవీతో బాక్సాఫీస్ వద్ద దారుణంగా దెబ్బతిన్న ఈ సూపర్ స్టార్ ఇప్పుడు ‘టైగర్ జిందా హై’తో మళ్లీ తన తన పవర్ చూపిస్తున్నాడు. టైగర్ జిందా హై వసూళ్లతో దూసుకెళ్తోంది. తొలి రెండు రోజుల కంటే మిన్నగా ఆదివారం  ఈ చిత్రం ఏకంగా రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.

 

కేవలం విడుదలైన నాలుగు రోజుల వ్యవధిలో ‘టైగర్’ జిందా హై ఇండియా వసూళ్లు రూ.150 కోట్ల మార్కును దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్ర నాలుగు రోజుల వసూళ్లు రూ.247 కావడం విశేషం. తొలి మూడు రోజుల్లో మాదిరే క్రిస్మస్ రోజు కూడా ఈ చిత్రం భారీ వసూళ్లే రాబట్టింది. ఐదో రోజు సెలవు కాకపోయినా వసూళ్లు నిలకడగానే ఉన్నట్లు ట్రేడ్ పండిట్లు చెబుతున్నారు. సల్మాన్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్టయిన ‘భజరంగి భాయిజాన్’ రూ.626 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఆ తర్వాత వచ్చిన ‘సుల్తాన్’ కూడా రూ.600 కోట్ల మార్కును అందుకుంది.

 

ఇదే ఊపు కొనసాగితే.. ‘టైగర్ జిందా హై’ కలెక్షన్లు ఈ రెంటినీ దాటేసే అవకాశాలున్నాయి. రెండో వారాంతంలో కూడా సల్మాన్ సినిమా జోరు కొనసాగించే అవకాశముంది. ఇయర్ ఎండింగ్ హంగామాలో భాగంగా ఈ చిత్రానికి మంచి వసూళ్లే రావచ్చు. యశ్ రాజ్ ఫిలిమ్స్ బేనర్లో సల్మాన్ చేసిన ‘ఏక్ థా టైగర్’కు ‘టైగర్ జిందా హై’ సీక్వెల్. తొలి చిత్రాన్ని కబీర్ ఖాన్ రూపొందిస్తే.. రెండో చిత్రాన్ని ‘సుల్తాన్’ దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ తీర్చిదిద్దాడు. ఈ చిత్రంలో సల్మాన్ మాజీ ప్రేయసి కత్రినా కైఫ్ కథానాయికగా నటించింది.

loader