సారాంశం

బాలీవుడ లో మరోసారి కలకలం రేగింది. సల్మాన్ ఖాన్ కు ప్రమాదం మరింత పెరిగినట్టు తెలుస్తోంది. ఆయనకు మరోసారి బెదిరింపు కాల్స్ రావడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. 
 

ప్రముఖ బాలీవుడ్ నటుడు,  స్టార్ సీనియర్ సల్మాన్ ఖాన్ మరోసారి ప్రమాదంలో పడ్డారు. ఆయనకు అన్నివైపుల నుంచి ప్రమాదం పొంచి ఉండగా.. అది మరింత పెరిగింది.  మరోసారి జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి సల్మాన్ కు  బెదిరింపు వచ్చింది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా లో బాలీవుడ్ నటుడికి బెదిరింపు రావడంతో ముంబయి పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే  మంగళవారం సల్మాన్ ఖాన్‌కు ఇస్తున్న  భద్రతపై సమీక్షించారు. 

ఎక్కడా ఏ పొరపాటు జరగకుండా రివ్యూ చేశారు. ఇటు ప్రభుత్వం నుంచి బద్రతతో పాటు.. అటు ప్రైవేట్ గా కూడా సల్మన్ ఖాన్ బద్రతను పొందుతున్నారు. ఇక గ్యాంగ్ స్టార్ లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు చేసిన డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో జైలులో ఉన్నాడు. ఇటీవల వాంకోవర్ నివాసంపై జరిగిన దాడికి సంబంధించి పంజాబీ గాయకుడు గిప్పీ గ్రేవాల్‌ను ఉద్దేశించి ఫేస్‌బుక్ పోస్ట్ సల్మాన్ ఖాన్‌కు కూడా హెచ్చరిక చేసింది.

Katrina Kaif: కత్రీనా కైఫ్ కు 5 కోట్లు అప్పు ఎగ్గొట్టిన టాలీవుడ్ యంగ్ హీరో..?

మీరు కోరుకున్న ఏ దేశానికైనా పారిపోండి, అయితే గుర్తుంచుకోండి, మరణానికి వీసా అవసరం లేదు అని గ్యాంగ్ స్టర్ లారెన్స్ హెచ్చరించాడు. ముప్పు గురించి తెలుసుకున్న ముంబయి పోలీసులు వెంటనే సల్మాన్ ఖాన్ భద్రతా ఏర్పాట్లను మరోసారి పరిశీలించారు. . ఈ ఏడాది మార్చిలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ ఖాన్‌కు మరణ బెదిరింపు ఈ-మెయిల్ రావడంతో అతని భద్రతను కట్టుదిట్టం చేశారు. సల్మాన్ ఖాన్ కు గతంలోనూ హత్య బెదిరింపులు కూడా వచ్చాయి.

యూకేలో వైద్య విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థి మెయిల్ ద్వారా ఈ బెదిరింపులకు పాల్పడ్డినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సల్మాన్ ఇటీవల బుల్లెట్ ప్రూఫ్ ఎస్ యూవీని కొనుగోలు చేశారు. ఈ ఏడాది మార్చిలో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఓ ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్‌ను చంపడమే తన జీవిత లక్ష్యం అని చెప్పాడు. కృష్ణజింకను చంపినందుకుగాను ఆయన తమ సమాజానికి క్షమాపణలు చెప్పినప్పుడే అది ముగుస్తుందని అన్నారు.


 
కృష్ణజింకను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ చాలా కాలంగా వివాదం ఫేస్ చేస్తున్నాడు. ఈ వివాదం ఎన్నో ఏళ్లుగానడుస్తుండగా. కృష్ణ జింకను భగవంతుని స్వరూపంగా భావించే బిష్ణోయ్ తెగ నుంచి సల్మాన్ ఖాన్ పై తీవ్రవ్యాతిరేకత ఎదురయ్యింది. ఈ తెగకుచెందిన గ్యాంగ్ స్టార్ లారెన్స్ బిష్ణోయ్ సల్మాన్ ను ఎలాగైనా చంపేస్తామని శపదం చేశారు. రీసెంట్ గా సల్మాన్ ఖాన్ టైగర్ 3 మూవీతో ఆడియన్స్ ను పలుకరించాడు. ఈమూవీ 400 కోట్ల వరకూ కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది.