బాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్. 59 ఎళ్లు దాటినా ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు సల్మాన్. లైఫ్ టైమ్ బ్యాచిలర్ గా మిగిలిపోయాడు. చాలా స్ట్రాంగ్ గా, స్టైలీష్ గా కనిపించే సల్మాన్ ఖాన్ కు ఎన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయో తెలుసా?

బాలీవుడ్ హిస్టరీలో సల్మాన్ ఖాన్ ది ఓ ప్రత్యేక ఛాప్టర్. సల్మాన్ ఖాన్ సినిమాలు, లవ్ అఫైర్స్, వివాదాలు అన్నింటి గురించి ఫ్యాన్స్ కు తెలుసు. ప్రస్తుతం ఆయనకు ఉగ్రవాదుల నుంచి ప్రమాదం ఉన్న సంగతి కూడా తెలుసు. అందుకే సల్మాన్ కు ప్రభుత్వం భద్రతను కూడా కల్పించింది. ఇక సల్మాన్ ఖాన్ కు సబంధించిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ప్రస్తుతం బయటకు వచ్చాయి. రీసెంట్ గా “ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో”కు సల్మాన్ ఖాన్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యాడు. ఈ సందర్భంగా సల్మాన్ తన జీవితంలో ఇటివల ఎదురైన అనారోగ్య సమస్యలను గురిచి వెల్లడించి ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరిచాడు.

సల్మాన్ ఖాన్ ఏమన్నారంటే .. సినిమాల్లో చాలా సార్లు నా ఎముకలు, పక్కటెముకలు విరిగిపోయాయి, ట్రైజెమినల్ న్యూరల్జియా ఉన్నప్పటికీ నేను పని చేస్తున్నాను. నాకు మెదడులో అనూరిజం ఉంది. రక్తనాళాలకు సంబంధించిన ప్రాబ్లమ్ కూడా (AV మాల్ ఫార్మేషన్) ఉంది. అయినా నేను ఇంకా పనిచేస్తున్నాను, అని సల్మాన్ చేసిన కామెంట్స్ అందరికి షాక్ ఇచ్చాయి.

సల్మాన్ ఖాన్ తెలిపిన ఆరోగ్య సమస్యలు :

సినిమాల్లో యాక్షన్ చేయడం వల్ల అనేక సార్లు పక్కటెముకలు విరిగిపోవడం జరిగింది. ఇలా అవ్వడం వల్ల శరీరం గాయాలకి గురవడంతో అనేక సమస్యలు ఇప్పటికి వస్తుంటాయని సల్మాన్ ఖాన్ తెలిపారు. అయితే అది తన జీవితంలో భాగం అయ్యిందని, తనకు ఇవన్నీ అలవాటు అయ్యాయని ఆయన అన్నారు.

ట్రైజెమినల్ న్యూరల్జియా (Trigeminal neuralgia): ఇది ముఖంపై నొప్పి కలిగించే నరాల వ్యాధి. సల్మాన్ కి ఈ సమస్య ఉన్నా కూడా పనిచేయడంలో తాను వెనక్కి తగ్గలేదని చెప్పారు. ఎంత నొప్పినైనా భరిస్తూ పనిచేసుకుంటూ వెళ్తున్నారన్నారు.

బ్రెయిన్ అనూరిజం (Brain aneurysm): మెదడులో రక్తనాళాలు బలహీనత చెందడం వలన కలిగే హార్ట్ ప్రాబ్లమ్ ఇది. ఈ వ్యాధి తనకు రావడంతో చాలా ఇబ్బందులు పడ్డాన్నారు స్టార్ హీరో. ఎన్నో సార్లు ఈ సమస్య వల్ల ప్రమాదాల్ని ఫేస్ చేశానని సల్మాన్ ఖాన్ వెల్లడించారు.

AV మాల్ ఫార్మేషన్ (Arnold–Chiari malformation , Arteriovenous malformation): మెదడు , వెన్నుముకకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో అవరోధం ఏర్పడితే కలిగే వ్యాధి ఇది. ఈ అనారోగ్య సమస్య కూడా తనకు ఉందని సల్మాన్ ఖాన్ వెల్లడించారు. దీనివల్ల కూడా తాను చాలా ఇబ్బందిపడ్డారని సమాచారం.

సల్మాన్ మాట్లాడుతూ ఈ ఆనారోగ్య సమస్యల వల్ల నా సగం సంపాదన ట్రీట్మెంట్స్ కు సరిపోతుంది. ఒక్కోసారి మొత్తం ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇదంతా చిన్నప్పుడు జరిగి ఉంటే అంతా తిరిగి సంపాదించుకునేవాడిని. ఇప్పుడు కూడా మళ్ళీ మొదటి నుంచి మొదలుపెడతాను అని తెలిపారు.

ఇన్ని అనారోగ్య సమస్యలతో కూడా సల్మాన్ ఖాన్ సినిమాలు, షోలు, ప్రమోషన్లలో యాక్టివ్‌గా ఉన్నారు. “ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో”లో తన ఆరోగ్య పరిస్థితి మొత్తం వివరించారు. అయితే ఇదంతా అభిమానులకు అవగాహన కల్పించడానికి మాత్రమే తాను చెప్పినట్టు సల్మాన్ ఖాన్ వివరించారు.

ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్, తన లవ్ లైఫ్ విషయాలలో ఎప్పుడూ స్పష్టంగా మాట్లాడలేదు. అయితే ఈసారి ఆరోగ్యం విషయాల్లో మాత్రం మొదటిసారిగా ఇంత బోల్డ్ గా విషయం అంతా చెప్పడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అంతే కాదు తమ అభిమాన నటుడు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు. 59 ఏళ్ల సల్మాన్ ఖాన్ ఎన్నో అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నా, సినిమాలకు ఎప్పటికీ వెనక్కి తగ్గలేదని, తన శక్తి, పట్టుదలతో ముందుకు సాగుతున్నారని ఈ షోలో సెలబ్రిటీలతో పాటు నెటిజన్లు కూడా అంటున్నారు.