భార్య భర్తల మధ్య విడాకులు, భరణంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు స్టార్ హీరో సల్మాన్ ఖాన్. కాస్త ఘాటుగా చెప్పినా నిజం చెప్పారంటూ నెటిజన్లు సల్మాన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే?
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ తాజా ఎపిసోడ్‌లో సడెన్ గా ప్రత్యక్ష్యం అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కపిల్ శర్మ హోస్టింగ్ లో ప్రసారం అవుతున్న ఈ కామెడీ టాక్ షోలో సల్మాన్ సందడి చేయడం విశేషం. ఈ సీజన్‌కు మరో హైలైట్ ఏమిటంటే, మాజీ క్రికెటర్, ప్రముఖ రాజకీయ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఈ షోకు శాశ్వత అతిథిగా మళ్లీ చేరారు.
ఇప్పటికే సిద్ధూ ప్రకటించినట్లే, షో మొదటి అతిథిగా సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు. రీసెంట్ గా ఆ ఎపిసోడ్‌కు సంబంధించిన ఒక వీడియో క్లిప్ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమై విపరీతంగా వైరల్ అవుతోంది. ఇందులో సల్మాన్ ఖాన్ తన బ్రాండ్ 'బీయింగ్ హ్యూమన్' టీషర్ట్‌లో కనిపించగా, వివాహ జీవితం, విడాకులు, భరణం వంటి అంశాలపై తన అభిప్రాయాలను ఆయన షేర్ చేసుకున్నారు.
సల్మాన్ మాట్లాడుతూ, “గతంలో ప్రజలు ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసేవారు. సహనం ఉండేది. ఇప్పుడు రాత్రిళ్లు ఒకరి కాలు మరొకరి మీద పడిందంటేనో, గురక వేస్తున్నారంటేనో విడాకులు తీసుకుంటున్నారు. చిన్న అపార్థాలకే విడిపోతున్నారు. అంతేకాదు, విడాకుల తర్వాత ఆమె సగం డబ్బులు కూడా తీసుకెళ్లిపోతోంది,” అని స్పష్టంగా వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు కపిల్ శర్మతో పాటు నవజ్యోత్ సింగ్ సిద్ధూ, అర్చనా పూరన్ సింగ్ కూడా సపోర్ట్ చేశారు. ఈకామెంట్స్ విని వెంటనే వారు నవ్విన దృశ్యాలు సోషల్ మీడియాలో పలు ఫ్యాన్ పేజీల ద్వారా షేర్ అయ్యాయి.
ఫ్యాన్స్ కూడా సల్మాన్ వ్యాఖ్యలపై రకరకాలుగా స్పందిస్తున్నారు. దాదాపు అందరు సల్మాన్ ను సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. “ఆయన ఎప్పుడూ స్పష్టంగా మాట్లాడతారు, మేధావిగా ప్రవర్తించరు, చాలా సింపుల్ గా చెపుతారు అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. సల్మాన్ ఖాన్ నిజాలు చెబుతున్నారు, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం, అని మరొకరు కామెంట్ చేశారు. ఇది 100 శాతం నిజం, అని ఇంకొకరు కామెంట్ చేశారు.


