తొలిరోజు 'సాక్ష్యం' వసూళ్లు..

sakshyam movie first day collections
Highlights

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన 'సాక్ష్యం' సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా.. ఎగ్జిక్యూషన్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన 'సాక్ష్యం' సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా.. ఎగ్జిక్యూషన్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. టాక్ సంగతి ఎలా ఉన్నా.. బి,సి సెంటర్స్ లో ఈ సినిమా చక్కటి ఆదరణ లభిస్తోంది. మొదటిరోజు రెండు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా రూ.3.11 కోట్ల షేర్ ను వసూలు చేసింది. 'జయ జానకి నాయక' సినిమా తరువాత ఆ స్థాయిలో మొదటి రోజు కలెక్షన్స్ వసూలు చేసింది ఈ సినిమా. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.5.5 కోట్లు గ్రాస్ ను రాబట్టింది. తొలిరోజు రెండు రాష్ట్రాల్లో వచ్చిన వసూళ్ల వివరాలు.. 

నైజాం - 94,00,000
సీడెడ్ - 50,00,000
నెల్లూరు - 15,00,000
గుంటూరు - 49,00,000
కృష్ణ - 19,00,000
వెస్ట్ - 20,00,000
ఈస్ట్ - 27,00,000
ఉత్తరాంధ్ర - 37,00,000 

ఇలా మొత్తంగా కలుపుకొని చూస్తే.. 3.11 కోట్లు.. ఇక మిగిలిన ఏరియాలు ఎలా చూసుకున్నా మరో ఇరవై లక్షలు వసూలు చేసి ఉంటాయి. అంటే ఓవరాల్ గా సినిమా 3.31 కోట్ల షేర్ ను రాబట్టింది. 

loader