తన కన్నా చిన్నగా కనపడుతుందని పవన్ కళ్యాణ్ నో చెప్తారా?
సీనియర్ హీరోలు ప్రక్కన యంగ్ హీరోయిన్స్ చేయటానికి పెద్దగా ఇష్టపడరు. కానీ పవన్ కు ఉన్న క్రేజ్ వేరు. దాంతో ఆయన సినిమాలో వేషం కోసం పోటీ పడుతూంటారు. తాజాగా ఆ లిస్ట్ లోకి సాక్షి వైద్య చేరబోతోందని సమాచారం.
సీనియర్ హీరోలు ప్రక్కన యంగ్ హీరోయిన్స్ చేయటానికి పెద్దగా ఇష్టపడరు. కానీ పవన్ కు ఉన్న క్రేజ్ వేరు. దాంతో ఆయన సినిమాలో వేషం కోసం పోటీ పడుతూంటారు. తాజాగా ఆ లిస్ట్ లోకి సాక్షి వైద్య చేరబోతోందని సమాచారం. ప్రస్తుతం అఖిల్ తో సినిమా చేస్తున్న ఆమె అవకాసం ఉంటే పవన్ ప్రక్కన చేయటానికి ఉత్సాహం చూపిస్తోందంటున్నారు. అయితే పవన్ నుంచే గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉందిట. వివరాల్లోకి వెళితే...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా కొత్త హీరోయిన్ ల తో నటించడం చాలా అరుదు. అప్పుడెప్పుడో "పంజా" మూవీలో సారా జేన్ డయాస్ చేసింది. ఆ తరువాత పవన్ కళ్యాణ్ కొత్త హీరోయిన్ తో నటించింది లేదు. అయితే తాజా సమాచారం ప్రకారం చాలా కాలం తర్వాత ఒక కొత్త అమ్మాయి పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా కనిపించబోతోందట. ఆమె సాక్షి వైద్య. మోడల్ గా తన కెరియర్ ను మొదలు పెట్టిన సాక్షి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా ఎంపిక అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం సాక్షి వైద్య ను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఇప్పటికే సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న "ఏజెంట్" సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా చేస్తోంది. అయితే "ఏజెంట్" సినిమా లో సాక్షి నటన చూసి ఇంప్రెస్ అయ్యి సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ సినిమాకి కూడా ఈమె ని హీరోయిన్ గా ఎంపిక చేశారంటున్నారు. అయితే ఏజ్ గ్యాప్ కనపడుతుందా అనే సమస్యతో ఫొటో షూట్ చేసి పైనలైజ్ చేయాలనుకుంటున్నారు. దానికి తోడు పవన్ సైతం ఇంకా ఓకే చెప్పలేదట.
Also read Breaking news: ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్.. ఆందోళనలో అభిమానులు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా నాలుగు సినిమాల్ని లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ‘భీమ్లానాయక్, హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్‌సింగ్’ చిత్రాలతో పాటు సురేంద్రరెడ్డి దర్శకత్వంలో చిత్రాన్ని కూడా అనౌన్స్ చేశారు. రామ్ తాళ్ళూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వచ్చేఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాల్ని చేస్తుండడంతో సూరి ఈ గ్యాప్ లో అఖిల్ తో ‘ఏజెంట్’ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే టైమ్ కి పవన్ సినిమాను సురేంద్ర రెడ్డి ప్రారంభించనున్నారు.