Breaking news: ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్.. ఆందోళనలో అభిమానులు
రజనీకాంత్ కేవలం రెగ్యూలర్ హెల్త్ చెకప్ కోసమే ఆసుపత్రిలో చేరినట్టు ఆయన సన్నిహిత వర్గాల నుంచి తెలుస్తున్న వార్త. అయితే ఇందులో ఎంత వరకు నిజమనేది తెలియాల్సి ఉంది. రజనీకాంత్ గత కొద్ది రోజుల క్రితమే అమెరికాలో హెల్త్ చెకప్ చేసుకున్న విషయం తెలిసిందే.
సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) ఆసుపత్రి పాలయ్యారు. ఆయన గురువారం సాయంత్రం చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆసుపత్రిలో చేరడానికి గల కారణాలేంటనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఆయన ఉన్నట్టుండి అనారోగ్యానికి గురయ్యారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. Rajinikanth ఆసుపత్రిలో జాయిన్ అయ్యారనే వార్త ఇప్పుడు అభిమానులను ఆందోళనకు గురి చేస్తుంది.
అయితే రజనీకాంత్ కేవలం రెగ్యూలర్ హెల్త్ చెకప్ కోసమే ఆసుపత్రిలో చేరినట్టు ఆయన సన్నిహిత వర్గాల నుంచి తెలుస్తుంది. కేవలం చెకప్ చేసుకుని వెంటనే వెళ్లిపోయారని తెలుస్తుంది. అయితే ఇందులో ఎంత వరకు నిజమనేది తెలియాల్సి ఉంది. రజనీకాంత్ గత కొద్ది రోజుల క్రితమే అమెరికాలో హెల్త్ చెకప్ చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఇంతలోనే మరోసారి హెల్త్ చెకప్ కోసం వెళ్లారనే దాంట్లో ఎంత నిజముందనేది సస్పెన్స్ గా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే ఇటీవల రజనీకాంత్ ప్రతిష్టాత్మక `దాదా సాహెబ్ ఫాల్కే` అవార్డుని ఉపరాష్ట్రపతి నుంచి అందుకున్న విషయం తెలిసిందే. ఇండియన్ సినిమాకు ఆయన చేసిన విశేష సేవలకుగానూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారంతో గౌరవించింది. ఈ సందర్భంగా రజనీకాంత్ అటు ప్రధాని నరేంద్రమోడీని, ఇటు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ని కలిశారు. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే ప్రస్తుతం రజనీకాంత్ `అన్నాత్తే` చిత్రంలో నటిస్తున్నారు. ఇది తెలుగులో `పెద్దన్న`(Peddanna) పేరుతో విడుదల కాబోతుంది. దీపావళి కానుకగా నవంబర్ 4న ఈ సినిమా రిలీజ్ కానుంది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుంది. శివ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రజనీ సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుంది. రజనీకి చెల్లిగా కీర్తిసురేష్, మీనా, ఖుష్బు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బుధవారం విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ విశేష ఆదరణ పొందింది.
aslo read: బిగ్ ట్విస్ట్ః బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మరోసారి సినిమా.. మహేష్ ప్రాజెక్ట్ ఆగిపోయిందా?