భారత బ్యాడ్నింటన్ ఏస్ ప్లేయర్ సైనా నెహ్వాల్ ఇటీవల కాలంలో ఫిలిం ఇండస్ట్రీకి మరింత దగ్గరవుతోంది. తన జీవితం ఆధారంగా శ్రద్దా కపూర్ హిరోయిన్ గా సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అంతేకాక ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కి టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సినీపరిశ్రమలో పలువురు క్లోజ్ ఫ్రెండ్స్ వున్న సంగతి తెలిసిందే.

 

అయితే పరిశ్రమలో తనకి ఎంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ వున్నా సరే... తన ఫేవరైట్ హీరో మాత్రం ప్రభాసే అని తరచుగా చెప్పే సైనా తాజాగా అతడిని కలిసిన సందర్భంగా తీసుకున్న ఓ ఫోటోని ట్విటర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా హైదరాబాద్‌లో తెరకెక్కుతున్న సాహో సినిమా సెట్స్‌లో ప్రభాస్‌ని కలిసిన సందర్భంగా సరదాగా కాసేపు అతడితో ముచ్చటించిన అనంతరం తీసుకున్న ఫోటో ఇది.బాహుబలి ప్రభాస్‌తో తీసుకున్న ఫోటో అంటూ సైనా నేహ్వాల్ షేర్ చేసుకున్న ఫోటోకి కొద్ది సేపట్లోనే వేలకొద్ది లైక్స్, వేయికిపైగా రిట్వీట్స్ వచ్చాయి. ఇక కామెంట్స్ సంగతైతే చెప్పనక్కరేలేదు. సైనా నేహ్వాల్ ప్రభాస్‌ని కలిసిన సమయంలో సైనా తల్లిదండ్రులు కూడా ఆమె వెంటే వున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్టుపై మీరూ ఓ లుక్కేయండి మరి!