Asianet News TeluguAsianet News Telugu

ఎంత పెట్టారు, ఎంతొచ్చింది: 'రిపబ్లిక్‌' ఫస్ట్ వీక్ కలెక్షన్స్


ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాకు  సాయి ధరమ్ తేజ్ గత సినిమాలతో పోలిస్తే రిపబ్లిక్ సినిమాకు చాలా తక్కువ వసూళ్ళు వచ్చాయి.  సాయి సినిమాకు తొలిరోజు వచ్చే కలెక్షన్స్.. ఇప్పుడు రిపబ్లిక్ సినిమాకి రావటానికి నాలుగు రోజులు పట్టింది. 

Sai Tejs  Republics first week collections are here
Author
Hyderabad, First Published Oct 10, 2021, 8:07 AM IST

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవా కట్టా తెరకెక్కించిన రిపబ్లిక్ సినిమా అక్టోబర్ 1న విడుదలైన సంగతి తెలిసిందే. తొలిరోజు దీనికి మిక్సెడ్ టాక్ వచ్చింది. సినిమా బాగుంది కానీ చివర్లో హీరో చనిపోవడాన్ని చాలా మంది జీర్ణించుకోలేదు. రివ్యూస్ కూడా కొంచెం అటూ ఇటూగానే వచ్చాయి.టాక్ కు తగ్గట్లేకలెక్షన్స్ కనపడుతున్నాయి. ఫస్ట్ వీకెండ్ ఓకే అనిపించుకున్నా ఆ తర్వాత డ్రాప్ కనపడింది.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాకు  సాయి ధరమ్ తేజ్ గత సినిమాలతో పోలిస్తే రిపబ్లిక్ సినిమాకు చాలా తక్కువ వసూళ్ళు వచ్చాయి.  సాయి సినిమాకు తొలిరోజు వచ్చే కలెక్షన్స్.. ఇప్పుడు రిపబ్లిక్ సినిమాకి రావటానికి నాలుగు రోజులు పట్టింది. ఇప్పటిదాకా ప్రపంచ వ్యాప్తంగా 6.73 కోట్ల షేర్ వచ్చిందని సమాచారం.ఈ వీకెండ్ లో ఏమన్నా కలెక్ట్ చేస్తే సేఫ్ జోన్ లో పడుతుంది అంటున్నారు.

Also read వద్దని చెబుతున్నా తేజు వినడం లేదా..హెల్త్ అప్డేట్ ఇచ్చిన నాగబాబు

అందుకే సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించినా కూడా నెగిటివ్ క్లైమాక్స్ వసూళ్ళపై దారుణమైన ప్రభావం చూపించింది. కీలకమైన సోమవారం రోజు కేవలం 40 లక్షల షేర్ మాత్రమే వసూలు చేసింది ఈ చిత్రం. ఇప్పటి వరకు 4 రోజుల కలెక్షన్స్ ఓసారి చూద్దాం..
  
నైజాం 2.10
సీడెడ్ 1.11
వైజాగ్  0.76
ఈస్ట్ గోదావరి 0.47
వెస్ట్ గోదావరి 0.41
కృష్ణా 0.41
గుంటూరు 0.47
నెల్లూరు 0.28

ఆంధ్రా&తెలంగాణా షేర్: 6.01 కోట్లు
భారత్ లో మిగతా ప్రాంతాలు 0.72

మొత్తం ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన షేర్: 6.73 కోట్లు

  రిపబ్లిక్ సినిమాకు ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రూ.12 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసారు. సాయి రేంజ్‌కు ఇది తక్కువే కానీ సినిమాకు టాక్ తేడాగా ఉండటంతో కలెక్షన్స్ తక్కువగా వస్తూండటంతో రికవరీ ఎంతవరకూ ఉంటుందనేది  ప్రశ్నార్దంగా మారింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios