SaiRam Shankar: పట్టుకుంటే పదివేలు, విలన్‌ ఎవరో చెప్పండి, పదివేలు పట్టుకుపోండి అంటున్నారు హీరో సాయిరామ్‌ శంకర్‌.  `ఒక పథకం ప్రకారం` మూవీలో హీరోగా నటిస్తున్న ఆయన ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.  

SaiRam Shankar: సినిమా చూడానికి డబ్బులు పెట్టాలి. కానీ సినిమా చూస్తే పదివేల డబ్బులు ఇస్తారట. అయితే దీనికి చిన్న కండీషన్‌ ఉంది. సినిమా చూసి ఫస్టాఫ్ అయిపోయిన తర్వాత విలన్‌ ఎవరో గెస్ చేస్తే ఆ పదివేలు ఇస్తారట. కరెక్ట్ గా విలన్‌ ఎవరో గెస్‌ చేస్తే పది వేలు పొందొచ్చు అని చెబుతున్నాడు హీరో సాయిరామ్‌ శంకర్‌. స్టార్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ తమ్ముడు సాయిరామ్‌ శంకర్‌ గతంలో హీరోగా రాణించిన విషయం తెలిసిందే. ఇటీవల కొంత గ్యాప్‌ వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఆయన `ఒక పథకం ప్రకారం` అనే సినిమాలో నటించారు. 

దీనికి వినోద్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. గార్లపాటి రమేష్‌, వినోద్‌ కుమార్‌ విజయన్‌ నిర్మించారు. ఇందులో శృతి సోది, ఆషిమా నర్వాల్‌, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 7న ఈ మూవీ విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా హీరో సాయి రామ్‌ శంకర్‌ మంగళవారం మీడియాతో ముచ్చటించారు. ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. విలన్ ఎవరో ఇంటర్వెల్ కు చెబితే రూ. 10,000 పట్టుకెళ్ళండి', 'పట్టుకుంటే 10 వేలు' అంటున్నారు.

దీనికి రెస్పాన్స్ అయితే అద్భుతంగా ఉంది. సినిమా పేరు, రిలీజ్ అవుతుందన్న విషయం తెలియడానికి ఇది బాగా ఉపయోగపడింది. మొదటి నుంచి ఇదొక్కటే అనుకున్నాం. సినిమా చూశాక మా యూనిట్‌లో కీలక సభ్యులు 'పట్టుకుంటే పదివేలు' అని చెప్పడంతో దీన్నే ఫిక్స్ అయ్యామని తెలిపారు. 

``ఒక పథకం ప్రకారం' 80% క్రైమ్ జానర్ కథలకు వాడతాం. ఈ సినిమాలో ఉండే ప్రతి పాత్రకు ఎవరి ప్లానింగ్ వారికి ఉంటుంది. కాబట్టి 'ఒక పథకం ప్రకారం' అనే టైటిల్ సెలెక్ట్ చేసుకున్నాం. లవ్ స్టోరీ బెస్ట్ క్రైమ్ మూవీ. ఇందులో నా పాత్ర క్రిమినల్ లాయర్. నెమ్మదిగా నా క్యారెక్టర్ లో ఒక్కో షేడ్ బయట పడుతుంది. క్రిమినలా లేకపోతే క్రిమినల్ లాయరా అనిపించేలా ఉంటుంది. అయితే ఈ సినిమాలో నా పాత్ర కోసం వన్ మంత్ ట్రైనింగ్, వర్క్ షాప్స్ కూడా చేశాను. 

షూటింగ్ కోసం 25 డాగ్స్ తెచ్చాము. క్లైమాక్స్ సీక్వెన్స్ ఏకంగా 4 రోజులు చేశారు. ఆ టైంలో డాగ్ పైకి రావడంతో, గ్రిల్ ఎక్కేశాను. లక్కీగా ఎస్కేప్ అయ్యాను. ఆ ఫైట్ చాలా బాగుంటుంది. ముందుగా ఒక క్లైమాక్స్ సీన్ తీసి, సరిపోట్లేదని మళ్లీ ఎక్స్టెండెడ్ వెర్షన్ తీశారు డైరెక్టర్. ఏడెనిమిది రోజులు క్లైమాక్స్ కోసమే షూటింగ్ చేశాం.

గతంలో ఇలాంటి సస్పెన్స్ జానర్ సినిమా, ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్ నేను చేయలేదు. నెల ట్రైనింగ్ తర్వాత రియాలిస్టిక్ గా చేశామన్న సంతృప్తి లభించింది. ఈ నెల 7న మూవీ విడుదలవుతుంది. మేము 'తండేల్'తో పాటు రిలీజ్ చేయట్లేదు. 'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం. దాదాపు యాభై సెంటర్లలో రిలీజ్‌ ప్లాన్‌ చేస్తున్నామ`ని తెలిపారు సాయి రామ్‌ శంకర్‌. 

అన్న పూరీ జగన్నాథ్‌ ట్రైలర్‌ చూశారని, చాలా బాగుందని మెచ్చుకున్నట్టు తెలిపారు. నెక్ట్స్ సినిమాల గురించి చెబుతూ, `ఓ మైథలాజికల్ సిరీస్ చేస్తున్నాం. అందులో 60 ఏళ్ల ఓల్డ్ రోల్ నాది. ఇప్పుడు చేస్తున్న సినిమాల లిస్ట్ లో 'రీసౌండ్' ఉంది. ఇంకొన్ని చర్చల దశలో ఉన్నాయ`న్నారు.

read more: Ntr Statement: ఎన్టీఆర్‌ సంచలన నిర్ణయం, త్వరలో భారీ సభ.. కారణం అదేనా?

also read: Mokshagna: మోక్షజ్ఞ-ప్రశాంత్‌ వర్మ సినిమా ఆగిపోలేదా? బాలయ్య సమక్షంలో డైరెక్టర్‌ క్లారిటీ