Ntr Statement: ఎన్టీఆర్ సంచలన నిర్ణయం, త్వరలో భారీ సభ.. కారణం అదేనా?
Ntr Statement: జూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఉద్దేశించి తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో తన సంచలన నిర్ణయాన్ని ఆయన వెల్లడించారు. భారీ సభకి ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు.

Ntr Statement: జూ. ఎన్టీఆర్ ఒక్క సారిగా అందరి అటెన్షన్ తనవైపు తిప్పుకున్నారు. ఆయన నుంచి వచ్చిన ప్రకటన ఇప్పుడు దుమారం రేపుతుంది. అటు టాలీవుడ్‌లో, ఇటు రాజకీయంగానూ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంది. ఎన్టీఆర్ నుంచి ఇలాంటి ప్రకటన రావడమేంటనేది ఆశ్చర్యపరుస్తుంది. మరి ఇంతకి ఎన్టీఆర్ ఏం చెప్పాడు. ఏం చేయబోతున్నాడనేది చూస్తే.
Jr NTR
ఎన్టీఆర్ తన అభిమానులను ఉద్దేశించి ఓ ప్రకటన విడుదల చేశారు. తనపై అభిమానులు చూపిస్తున్న అపారమైన ప్రేమ, గౌరవానికి ధన్యవాదాలు తెలియజేశారు. తనని కలుసుకోవాలని ఎదురు చూస్తున్న అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకుని, త్వరలో ఎలాంటి ఇబ్బందులు లేని సమావేశంలో వ్యక్తిగతంగా వారిని కలుసుకోవాలని నిర్ణయించుకున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమానికి అన్ని అనుమతులు పొందుతూ, పోలీస్ డిపార్ట్ మెంట్, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని శాంతి భద్రతల సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుని సమావేశం నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నామన్నారు.
ntr
ఇంత పెద్ద సమావేశం నిర్వహించడానికి కొంత సమయం అవసరం అవుతుంది, కాబట్టి అభిమానులు ఓర్పుగా ఉండాలని కోరుతున్నారు ఎన్టీఆర్. ఈ నేపథ్యంలో అభిమానులు తనని కలుసుకోవడానికి పాదయాత్ర వంటివి చేయరాదని వెల్లడించారు.
తన అభిమానుల ఆనందమే కాదు, వారి సంక్షేమం కూడా తనకు అత్యంత ప్రధానం అని తారక్ తన ప్రకటనలో తెలిపారు. ఇది ఆయన పీఆర్ టీమ్ నుంచి వచ్చిన ప్రకటన కావడం విశేషం. అయితే ఎన్టీఆర్ దీన్ని తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా కాకుండా పీఆర్ టీమ్ నుంచి ప్రకటన రూపంలో రావడం ఆశ్చర్యంగా మారింది. అనుమానాలకు తావిస్తుంది.
NTR
ఎన్టీఆర్ విడుదల చేసిన ఈ ప్రకటన అభిమానం అనే యాంగిల్‌లో కాకుండా రాజకీయం, నందమూరి ఫ్యామిలీ అనే కోణంలో నెటిజన్లు చూస్తున్నారు. గత కొంత కాలంగా తారక్‌ని నందమూరి ఫ్యామిలీ దూరం పెడుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇటీవల నందమూరి తారకరామారావు శత జయంతి వేడుకులకు సంబంధించిన పోస్టర్స్ లో తారక్ ఫోటోలు వేయలేదు.
మరోవైపు బాలయ్య బాబాయ్ ఆయన్ని దూరం పెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పెద్ద సభ ఏర్పాటు చేయాలనుకోవడమే ఆశ్చర్యంగా మారింది. అనేక కొత్త అనుమానాలకు తావిస్తుంది. ఈ వేదికగా ఆయన తన ఫ్యామిలీకి, రాజకీయంగా బలమైన స్టేట్‌మెంట్ ఇవ్వబోతున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. తన వైఖరిని ఆయన వెల్లడించబోతున్నారా? లేక పూర్తిగా ఫ్యాన్స్ మీట్‌గానే నిర్వహిస్తారా? అనేది మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది.
Junior NTR, Devara
ఇటీవల ఎన్టీఆర్ `దేవర` చిత్రంలో నటించారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ప్లాన్ చేసినా పోలీస్ అనుమతులు రాలేదు. దీంతో ఫ్యాన్స్ ని కలవలేకపోయారు తారక్. దీంతో ఫ్యాన్స్ నుంచి ఒత్తిడి ఉందని, అందుకే ఈ ఈవెంట్‌ని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అయితే ప్రస్తుతం ఆయన హిందీలో `వార్ 2`లో నటిస్తున్నారు. త్వరలో ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయాల్సిన సినిమా ప్రారంభం కానుంది.
read more: మోక్షజ్ఞ-ప్రశాంత్ వర్మ సినిమా ఆగిపోలేదా? బాలయ్య సమక్షంలో డైరెక్టర్ క్లారిటీ
also read: వాటివల్లే రాజశేఖర్ కెరీర్ డౌన్?, లేదంటే ఇప్పటికీ సూపర్ స్టార్‌గా వెలగాల్సిన హీరో