- Home
- Entertainment
- Mokshagna: మోక్షజ్ఞ-ప్రశాంత్ వర్మ సినిమా ఆగిపోలేదా? బాలయ్య సమక్షంలో డైరెక్టర్ క్లారిటీ
Mokshagna: మోక్షజ్ఞ-ప్రశాంత్ వర్మ సినిమా ఆగిపోలేదా? బాలయ్య సమక్షంలో డైరెక్టర్ క్లారిటీ
Mokshagna: మోక్షజ్ఞ హీరోగా పరిచయం కావాల్సిన ప్రశాంత్ వర్మ మూవీ ఆగిపోయిందనే ప్రచారం జరుగుతుంది. అయితే తాజాగా దీనిపై ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చారు.

Nandamuri Mokshagna
Mokshagna-prasanth varma:నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ తేజ హీరోగా పరిచయం చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. `హనుమాన్` దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించబోతున్నట్టు వెల్లడించారు.
ఇటీవల ఈ మూవీ ఆగిపోయిందనే వార్తలు ఊపందుకున్నాయి. ఆ మధ్య సినిమా ప్రారంభించాల్సి ఉండగా, మోక్షజ్ఞ ఆరోగ్యం బాగా లేదని, వాయిదా వేసినట్టు తెలిపారు. ఇది జరిగి చాలా రోజులవుతున్నా, ఇంకా ప్రారంభం కాలేదు.
Mokshagna Nandamuri
దీంతో మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ ఆగిపోయిందనే ప్రచారం ఊపందుకుంది. స్క్రిప్ట్ విషయంలో బాలయ్య రాజీపడటం లేదట. ఆ విషయంలోనే డిస్కషన్స్ జరుగుతున్నాయని తెలుస్తుంది. ప్రశాంత్ వర్మ చెప్పిన ఫైనల్ స్క్రిప్ట్ బాలయ్యకి నచ్చలేదని, దీంతో ఆల్టర్ నేట్ చూస్తున్నట్టు వార్తలు ఊపందుకున్నాయి. ఈ సినిమా ఆల్‌మోస్ట్ ఆగిపోయిందనే అంటున్నారు.
అయితే తాజాగా ప్రశాంత్ వర్మ మాటల ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి. బాలయ్యకి పద్మభూషణ్ పురస్కారం వరించిన . ఇందులో బాలకృష్ణ, వారి సిస్టర్స్ భువనేశ్వరితోపాటు పురందేశ్వరీ కూడా పాల్గొన్నారు. వీరితోపాటు ఆయనతో పనిచేసిన దర్శకులు కూడా అటెండ్ అయ్యారు. వారిలో బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి, బాబీ, గోపీచంద్ మలినేని, ప్రశాంత్ వర్మ కూడా ఉన్నారు.
బాలయ్యతో రెండు యాడ్స్ చేశారు ప్రశాంత్ వర్మ. అన్ స్టాపబుల్ షో కూడా చేశారు. ఆ వర్క్ బాలయ్యకి బాగా నచ్చింది. ఆ సమయంలోస్క్రిప్ట్ చెప్పగా, మోక్షజ్ఞని హీరోగా పరిచయం చేయాలని నిర్ణయించుకున్నారు.
అయితే ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ, బాలయ్య బాబుతో సినిమా చేయడానికి భయం వేసిందని, ఆ తర్వాత ఆయనపై గౌరవం పెరిగిందన్నారు. ఆయనపై ఉన్న ప్రేమని త్వరలోనే సినిమా ద్వారా చూపిస్తానని తెలిపారు ప్రశాంత్ వర్మ.
Mokshagna
అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. ప్రశాంత్ వర్మ.. బాలయ్యతో సినిమా చేయబోతున్నారా? మోక్షజ్ఞ సినిమా గురించే మాట్లాడారా? అనే సస్పెన్స్ నెలకొంది. ఆయన మాటలను బట్టి చూస్తే మోక్షజ్ఞ మూవీ ఆగిపోలేదని తెలుస్తుంది. మరి ఏం జరుగుతుందో మున్ముందు చూడాలి.