రూ.2కోట్ల ఆఫర్ ని రిజక్ట్ చేసిందట!

Sai Pallavi turns down 2 crore offer
Highlights

ఇప్పటికే సమంత, తమన్నా, పూజా హెగ్డే వంటి తారలు అతడితో కలిసి నటించారు. కాజల్ కూడా అతడితో రొమాన్స్ కి సిద్ధమైంది. అయితే యంగ్ డైరెక్టర్ తో శ్రీనివాస్ చేయబోయే సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవిని తీసుకోవాలనుకున్నారు. దాని కోసం ఆమెకు రూ.2కోట్లు ఆఫర్ చేశారు

టాలీవుడ్ లో యంగ్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది సాయి పల్లవి. ప్రస్తుతం ఆమె 'పడి పడి లేచే మనసు' సినిమాలో నటిస్తోంది. శర్వానంద్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. రీసెంట్ గా సాయి పల్లవికి ఓ సినిమా ఆఫర్ వచ్చిందట. నిర్మాతలు దాదాపు రూ.2 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తామని చెప్పారట.

అయినా.. సాయి పల్లవి మాత్రం ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసి వార్తల్లో నిలిచింది. అసలు విషయంలోకి వస్తే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇటీవల 'సాక్ష్యం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ హీరో చేతిలో రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దర్శకుడు తేజతో ఓ సినిమా చేస్తుండగా కొత్త దర్శకుడితో మరో సినిమాకు సైన్ చేశాడు. బెల్లంకొండ సురేష్ తన కొడుకు నటించే సినిమాల్లో స్టార్ హీరోయిన్లను తీసుకుంటూ ఉంటాడు.

ఇప్పటికే సమంత, తమన్నా, పూజా హెగ్డే వంటి తారలు అతడితో కలిసి నటించారు. కాజల్ కూడా అతడితో రొమాన్స్ కి సిద్ధమైంది. అయితే యంగ్ డైరెక్టర్ తో శ్రీనివాస్ చేయబోయే సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవిని తీసుకోవాలనుకున్నారు. దాని కోసం ఆమెకు రూ.2కోట్లు ఆఫర్ చేశారు. సాయి పల్లవి మార్కెట్ కి ఈ మొత్తం చాలా ఎక్కువ. కానీ సాయి పల్లవి మాత్రం రెమ్యునరేషన్ చూసి టెంప్ట్ అవ్వకుండా సినిమా చేయనని నిర్మొహమాటంగా చెప్పేసిందట. 

loader