'ఫిదా' బ్యూటీ ఆటో నడుపుతుంది!

sai pallavi plays an auto driver role in dhanush's maari2
Highlights

మలయాళంలో 'ప్రేమమ్' చిత్రంతో విపరీతమైన క్రేజ్ దక్కించుకున్న నటి సాయి పల్లవి 

మలయాళంలో 'ప్రేమమ్' చిత్రంతో విపరీతమైన క్రేజ్ దక్కించుకున్న నటి సాయి పల్లవి తెలుగులో 'ఫిదా'తో యూత్ అందరికీ ఫిదా చేసేసింది. ఈ సినిమాలో తెలంగాణా అమ్మాయిగా కనిపించి ప్రతి ఒక్కరినీ మెప్పించింది. ప్రస్తుతం ఈ భామ తమిళంలో ధనుష్ కు జంటగా 'మారి2' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో కూడా సాయి పల్లవి పాత్ర కొత్తగా ఉంటుందని తెలుస్తోంది.

ఇందులో సాయి పల్లవి ఆటో డ్రైవర్ గా కనిపించనుందట. ప్రస్తుతం చెన్నైలో ఆటో డ్రైవింగ్ ప్రాక్టీస్ చేస్తోంది. గతంలో ఫిదా సినిమా కోసం ట్రాక్టర్ నడపడం నేర్చుకున్నట్లు ఇప్పుడు ధనుష్ సినిమా కోసం ఆటో డ్రైవింగ్ నేర్చుకుంటుంది.

ధనుష్ నటించిన 'మారి' సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మొదటి పార్ట్ లో కాజల్ హీరోయిన్ గా కనిపించగా, ఇప్పుడు ఆమె స్థానాన్ని సాయి పల్లవితో రీప్లేస్ చేశారు. మరి ఆటో డ్రైవర్ పాత్రలో సాయి పల్లవి ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి!

loader