'ఫిదా' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన నటి సాయి పల్లవి అతి తక్కువ కాలంలో తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఓ పక్క తెలుగు సినిమాలలో నటిస్తూనే మరో పక్క తమిళ ప్రాజెక్టులు కూడా ఓకే చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో శర్వానంద్ తో కలిసి 'పడి పడి లేచే మనసు' అనే సినిమాలో నటిస్తోంది. హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. సాయి పల్లవి తన కుటుంబంతో మాత్రం కలిసి సమయం గడుపుతుంటుంది. ముఖ్యంగా తన చెల్లెలు పూజాతో కలిసి చేసే అల్లరిని  అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా సాయి పల్లవి చెల్లి పూజా ఒక ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఓ ఫోటోను షేర్ చేసింది. సాయి పల్లవి, పూజా కలిసి తీసుకున్న ఈ ఫోటో కాస్త ఇప్పుడు వైరల్ అవుతోంది

ఇద్దరూ ఎంతో అందంగా ఫొటోకు ఫోజిచ్చారు. ఈ మధ్య కాలంలో సాయి పల్లవి కూడా పెద్దగా బయట కనిపించకపోవడంతో అభిమానులు ఈ ఫోటోతో సరిపెట్టుకుంటున్నారు. తెలుగులో 'పడి పడి లేచే మనసు' తో పాటు తమిళంలో సెల్వ రాఘవన్ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తోంది. దర్శకుడు వేణు ఊడుగుల చెప్పిన ఫిమేల్ సెంట్రిక్ కథకు గ్రీన్ ఇచ్చిందని టాక్. 
 

 

Udanpirappe ❤️❤️

A post shared by pooja kannan (@poojakannan_97) on Jul 9, 2018 at 8:34am PDT