Asianet News TeluguAsianet News Telugu

"ఫిదా" పోరి సాయిపల్లవికి నాలుగేళ్ల పాప.. కన్ఫమ్

  • ఫిదా మూవీతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన సాయిపల్లవి
  • కోలీవుడ్ ఎంట్రీకి రెడీ అయిన మళయాల ముద్దుగుమ్మ
  • తమిళనాట నాలుగేళ్ల పాపతో ఎంట్రీ ఇస్తున్న ఫిదా పోరి
sai pallavi deglamour role in tamil movie kollywood

ఫిదా మూవీలో భానుమతి.. హైబ్రిడ్ పిల్ల.. ఒక్కటే పీస్.. అంటూ  తెలుగు ప్రేక్షకులను ఫుల్ ఫిదా చేసేసింది మలయాళ బ్యూటీ సాయిపల్లవి. తెలంగాణ యాసలో అదరగొట్టేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల లిస్ట్‌ లో ఫిదా మూవీ నిలవటంలో కీలక పాత్ర పోషించింది. అటు ప్రేమమ్ మూవీతో మలయాళ ప్రేక్షకుల్ని, ఇటు ఫిదా మూవీతో తెలుగు ప్రేక్షకుల్ని ఫిదా చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు తమిళ తంబీలను ఫిదా చేయడంపై ఫోకస్ పెట్టింది.



నిజానికి మణిరత్నం ‘కాట్రు వెలియిడై’ సినిమాతో కోలీవుడ్‌ ఆరంగేట్రం చేసే అవకాశం వచ్చినా చివర్లో చేజారింది. తరువాత విక్రమ్ ‘స్కెచ్’ మూవీలోనూ అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారింది. తాజాగా ప్రముఖ దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ చెప్పిన కథతో తమిళ ఇండస్ట్రీలో అడుగుపెడుతోంది సాయి పల్లవి. అయితే ఈ కథ దశాబ్దాలుగా భారతీయ సమాజంలో స్త్రీ ప్రధాన సమస్యల్లో ఒకటిగా ఉన్న అబార్షన్ల నేపథ్యంతో ‘కరు’ అనే వైవిద్యభరిత కథను తెరకెక్కించారు దర్శకుడు. ఈసినిమాలో సాయి పల్లవి పాత్ర డీ గ్లామర్ లుక్‌తో వినూత్నంగా ఉంటుందని.. సాయిపల్లవి నాలుగేళ్ల పాపకి తల్లిగా నటించిందని ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు దర్శకుడు ఏఎల్‌ విజయ్‌.



ఇది చాలెంజింగ్ పాత్ర అని ఈ రోల్‌‌కు సాయి పల్లవి 100% న్యాయం చేసిందని మలయాళం, తెలుగు భాషల్లో క్రేజీ హీరోయిన్‌గా పేరొందుతున్న సందర్భంలో ఇలాంటి రోల్ చేయడం సాహసమే అన్నారాయన. ‘కరు’ సినిమాతో సొసైటీకి మంచి మెసేజ్‌ను ఇస్తున్నామని అబార్షన్ల నేపథ్యంతో తల్లి, నాలుగేళ్ల కూతురు మధ్య అనుబంధాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నాము. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్‌ ని కంప్లీట్ చేసి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 



మొత్తానికి గ్లామర్ రోల్స్‌ ‌కు మాత్రమే హిరోయిన్స్ పరిమితమైపోతున్న ఈ రోజుల్లో సాయి పల్లవి ‘కరు’ లాంటి మూవీలో నటించి కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిందనే చెప్పాలి.

Follow Us:
Download App:
  • android
  • ios