ఈ ఇద్దరు బ్యూటీలు వారి బాయ్ ఫ్రెండ్స్ ను మర్చిపోయారట!

sai pallavi and anupama parameshwaran's upcoming movies with same story line
Highlights

మలయాళంలో 'ప్రేమమ్' చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి

మలయాళంలో 'ప్రేమమ్' చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్ లు ఇప్పుడు తమ బాయ్ ఫ్రెండ్స్ ను మర్చిపోయారట. మరి వీరిద్దరికి తము ప్రేమించినవాళ్ళు గుర్తుకువస్తారా..? చివరకు ఎలా కలుసుకుంటారనే ఆసక్తి కలుగుతోంది. ఇదంతా రియల్ లైఫ్ లో కాదండీ.. ఈ ఇద్దరు హీరోయిన్లు నటిస్తోన్న కొత్త సినిమా సంగతులు.

శర్వానంద్ హీరోగా నటిస్తోన్న 'పడి పడి లేచే మనసు' సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా కనిపించనుంది. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో హీరోయిన్ ను మెమొరీ లాస్ పేషెంట్ గా చూపించబోతున్నారట. ఈ మెమొరీ లాస్ కారణంగా ప్రేమించిన అబ్బాయిని కూడా మర్చిపోతుందట. చివర్లో వీరిద్దరూ ఎలా కలుస్తారనే అంశాలు సినిమాకు కీలకమని అంటున్నారు.

ఇక అనుపమ పరమేశ్వరన్, సాయి ధరం తేజ్ జంటగా దర్శకుడు కరుణాకరన్ 'తేజ్ ఐ లవ్ యు' అనే సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో కూడా హీరోయిన్ గతాన్ని మర్చిపోతుంది. తన బాయ్ ఫ్రెండ్ ను కూడా మర్చిపోతుంది. ఈ రెండు సినిమాలు కూడా ఒకే ప్లాట్ లో ఉంటాయని టాక్.

హాలీవుడ్ లో సక్సెస్ అయిన 'ది వో' అనే సినిమా లైన్ ను ఈ రెండు సినిమాలకు వాడుకున్నారనే రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. హాలీవుడ్ సినిమాకు ఫ్రీమేక్ పైగా తెలుగులో ఒకేలాంటి రెండు సినిమాలు.. మరి ఆడియన్స్ ఈ సినిమాలను ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి!
 

loader