సుప్రీం హీరో పతనానికి కారణమవుతున్నది ఎవరు..?

sai dharam tej's own script selection brings him down
Highlights

మెగాఫ్యామిలీ హీరోలు కథను విని తమ సన్నిహితులు, ఫ్యామిలీ మెంబర్స్ తో చర్చించి స్క్రిప్ట్ విషయంలో ఓ నిర్ణయానికి వస్తారు. కానీ తేజ్ మాత్రం కథల విషయంలో 
ఎవరి సలహాలు తీసుకోకుండా తనే ఫైనల్ డెసిషన్ తీసుకుంటాడట. ఈ విధంగా తన కెరీర్ ను తనే సమస్యల్లో పెట్టుకుంటున్నాడని చెబుతున్నారు

మెగామేనల్లుడు సాయి ధరం తేజ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి వరుసగా మూడు విజయాలు అందుకున్నాడు. 'సుప్రీం' సినిమాతో హీరోగా తన క్రేజ్ పెంచుకున్నాడు. ఆ సినిమా నుండి సుప్రీం హీరో అని స్క్రీన్ నేమ్ కూడా పెట్టేశారు. అయితే అప్పటి నుండి మొదలయ్యాయి తేజు కష్టాలు.. వరుసగా ఐదు సినిమాలు ఫ్లాప్ కూడా కాదు.. డిజాస్టర్లుగా మిగిలాయి. తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటెలిజెంట్ ఇలా వరుస అపజయాలు అతడిని కోలుకోలేని విధంగా చేశాయి. లవ్ స్టోరీస్ రూపొందించడంలో స్పెషలిస్ట్ అయిన కరుణాకరన్ తెరకెక్కించిన 'తేజ్ ఐ లవ్ యు' సినిమాతో తన కష్టాలన్నీ పోతాయనుకున్నాడు.

కానీ ఈ సినిమా తొలిషోతోనే నెగెటివ్ టాక్ తెచ్చుకోవడంతో తేజ్ పరిస్థితి మరీ గోరంగా తయారైంది. మెగాఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉండి, టాలెంట్ ఉన్న నటుడిగా గుర్తింపు పొందిన తేజ్ కు సక్సెస్ ఎందుకురావడం లేదనే విషయంలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. మెగా ఫ్యామిలీ నుండి యంగ్ హీరోలుగా వచ్చిన రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇండస్ట్రీలో తమస్టామినా నిరూపించుకున్నారు. వరుణ్ తేజ్ సైతం సరికొత్త కథలతో ముందుకు సాగుతూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. కానీ తేజ్ విషయంలో మాత్రం అలా జరగడం లేదు. దానికి కారణం తన సొంత నిర్ణయాలే అని తెలుస్తోంది.

మెగాఫ్యామిలీ హీరోలు కథను విని తమ సన్నిహితులు, ఫ్యామిలీ మెంబర్స్ తో చర్చించి స్క్రిప్ట్ విషయంలో ఓ నిర్ణయానికి వస్తారు. కానీ తేజ్ మాత్రం కథల విషయంలో ఎవరి సలహాలు తీసుకోకుండా తనే ఫైనల్ డెసిషన్ తీసుకుంటాడట. ఈ విధంగా తన కెరీర్ ను తనే సమస్యల్లో పెట్టుకుంటున్నాడని చెబుతున్నారు. తన తదుపరి సినిమా కూడా తనకు 'విన్నర్' లాంటి ఫ్లాప్ సినిమా ఇచ్చిన గోపీచంద్ మలినేనితో చేయడానికి రెడీ అవుతున్నాడు. కనీసం ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలోనైనా జాగ్రత్తలు తీసుకొని సక్సెస్ అందుకోవాలని కోరుకుందాం! 

loader