తనకు పెళ్లై భార్యా బిడ్డలున్నారంటున్న సాయిధరమ్ తేజ్

First Published 30, Nov 2017, 10:28 AM IST
sai dharam tej reveals about his secret family
Highlights
  • డిసెంబర్ 1న సాయిధరమ్ తేజ్ జవాన్ రిలీజ్
  • ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ఫ్యామిలీ గురించి చెప్పిన తేజ్
  • తనకు పెళ్లై ఇద్దరు కూతుళ్లున్నారన్న సాయిధరమ్ తేజ్

‘జవాన్’ సినిమా ప్రమోషన్ లో భాగంగా రేడియో సిటీకి వచ్చిన సాయి ధరమ్ తేజ్... తన రహస్య పెళ్లి విషయాలను వెల్లడించి అందరికీ షాకిచ్చాడు. ఎన్నిసార్లు మీరు క్లారిఫికేషన్ ఇచ్చినా కొన్ని రూమర్స్ మిమ్మల్ని వదిలి వెళ్ళడంలేదు. దీనికి పుల్‌స్టాప్ పెట్టే ఆలోచన ఉందా ? అని రేడియో జాకీ అడిగిన ప్రశ్నకు సాయి ధరమ్ తేజ్ ఊహించని సమాధానం ఇచ్చాడు.

 

త‌న‌కి ఎప్పుడో పెళ్ల‌యిపోయింద‌ని ఇద్దరు డాటర్స్ ఉన్నారని ఒక పాప‌కి ఆరేళ్లు మరో పాప‌కి రెండేళ్లు యా ఐయామ్ హ్యాపీలీ మ్యారీడ్, వెరీ పీస్ ఫుల్ లైఫ్ గడుపుతున్నాను అంటూ దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చాడు. ఇలాంటి రిప్లైకి షాక్ అయిన ఆ రేడియో జాకీ తేజ్ ను గుచ్చిగుచ్చి ఎన్నిసార్లు అడిగినా ఇదే సమాధానం ఇచ్చి ఆ రేడియో జాకీని తెగ ఆట పట్టించాడు.

 

చివరకు ఇలా ఎందుకు చెపుతున్నారు అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ తన పై రాస్తున్న డేటింగ్ రూమర్ల వార్తలను చూసి విసుగు చెందానని అందుకే తనకు తానే తన ఫ్యామిలీని క్రియేట్ చేసుకున్నాను అంటూ జోక్ చేసాడు.

 

ఈ సందర్భంగా ఒక అభిమాని తనకు వాట్సాప్‌ లో పెట్టిన ఒక మీమ్ గురించి చెపుతూ మెహరీన్ తో తన ఫోటోను పెట్టి ‘బాబూ సాయి ధరమ్ తేజ్ రొమాన్స్ అంటే ముద్దుగా బొద్దుగా చేయాలి అంతే కానీ యుద్ధంలా చేయకూడదు’ అని అంటూ పెట్టిన కామెంట్స్ చూసి తెగ నవ్వుకున్న విషయాన్ని బయటపెట్టాడు.

 

రేపు విడుదల కాబోతున్న ‘జవాన్’ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్న తేజ్ ఈసినిమాకు మంచి ఓపెనింగ్స్ తీసుకు రావడానికి ఇలా తనకు ఒక కుటుంబం కూడా ఉందని క్రియేట్ చేసి ‘జవాన్’ సినిమా పై క్రేజ్ పెంచే ప్రయత్నం చేస్తున్నాడు.

loader