Asianet News TeluguAsianet News Telugu

సాయి ధరమ్ తేజ్, బివిఎస్ రవి, కృష్ణ "జవాన్" మూవీ ఫస్ట్ సాంగ్ కి అద్భుతమైన స్పందన

  • సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ ఫిర్జాదా జంటగా జవాన్
  • బివిఎస్ రవి దర్శకత్వం వ‌హిస్తున్నచిత్రాన్ని సమర్పిస్తున్న దిల్ రాజు
  • అరుణాచల్ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిన జవాన్ సాంగ్ కు అద్భుత స్పందన
sai dharam tej jawaa first song gets huge response

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ ఫిర్జాదా జంటగా బివిఎస్ రవి దర్శకత్వం వ‌హిస్తున్నచిత్రం జవాన్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జవాన్ ఫస్ట్ సాంగ్  ను సాయిధరమ్ తేజ్ బర్త్ డే కానుకగా చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ పాట అంచనాల్ని మించి ఉండడంతో… అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ పాటకు థమన్ ట్రెండీ ట్యూన్ అందించాడు. కె కె అందించిన సాహిత్యం లో హీరో క్యారెక్టర్ ని జవాన్ థీమ్ ని ఎలివేట్ చేసింది. ఇటీవలే విడుదల చేసిన టీజర్ తో భారీ గా అంచనాలు పెరిగిన సంగతి తెలిసిందే.  సాయి ధరమ్ తేజ్ ని కొత్తగా చూపించబోతున్నాడని స్పష్టంగా అర్థమవుతోంది. సాయి ధరమ్ ఇప్పటివరకు చేసిన కమర్షియల్ చిత్రాలు ఒక ఎత్తయితే… జవాన్ లో చేసిన క్యారెక్టర్ మరో ఎత్తు. తమన్ రీ రికార్డింగ్, కెవి గుహన్ సినిమాటోగ్రఫి హైలైట్ గా ఉండనుంది. 

 

దేశానికి జవాన్ ఎంత అవసరమో... ప్రతీ ఇంటికి మా కథానాయకుడి లాంటి వాడు ఉండాలని చెప్పడమే మా ఉద్దేశ్యమని దర్శకుడు బివిఎస్ రవి చెబుతున్నారు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడి పాత్రలో సాయి ధరమ్ కనిపిస్తున్నాడు. తన కుటుంబాన్ని మ‌నోదైర్యంతో, బుద్దిబ‌లంతో ఎలా కాపాడుకున్నాడన్నదే జవాన్ కథ. అందుకే ఇంటికొక్కడు అనే క్యాప్షన్ పెట్టారు. ఇది పక్కా ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ఎంటర్ టైనింగ్ కమర్షియల్ చిత్రం. తమన్ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు. సాయిధరమ్ తేజ్ పుట్టిన రోజు సందర్బంగా విడుదల చేసిన సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ రావడం హ్యాపీ గా ఉంది. మెహ్రీన్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్.  ప్రసన్న మెయిన్ విలన్ గా నటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే జవాన్ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు స‌న్నాహలు చేస్తున్నారు.

 

నటీనటులు - సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్, ప్రసన్న , జయప్రకాష్, ఈశ్వరీ రావ్ తదితరులు, కెమెరా మెన్ - కెవి గుహన్, మ్యూజిక్ - తమన్, ఆర్ట్ - బ్రహ్మ కడలి, ఎడిటింగ్ - ఎస్.ఆర్.శేఖర్, సహ రచయితలు - కళ్యాణ్ వర్మ దండు, సాయి కృష్ణ, వంశీ బలపనూరి, పి.ఆర్‌.ఓ - ఏలూరు శ్రీను, బ్యానర్ - అరుణాచల్ క్రియేషన్స్, సమర్పణ - దిల్ రాజు, నిర్మాత - కృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ - బివిఎస్ రవి.

Follow Us:
Download App:
  • android
  • ios