ఇంటిలిజెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్న సాయిధరమ్ తేజ్ ఇటీవల మూవీ ప్రమోషన్ ఇంటర్వ్యూలో భాగంగా రెజీనాపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఓ హీరో కారణంగా నా కెరీర్ పాడైపోయిందని ఇటీవల రెజీనా కసాండ్రా చేసిన వ్యాఖ్యలపై సాయిధరమ్ తేజ్ స్పందించడానికి నిరాకరించారు. నాకు క్లోజ్ ఫ్రెండ్ అయినంత మాత్రనా ఆమె వ్యక్తిగత విషయంపై నేను కామెంట్ చేయడం తగదు అని సాయిధరమ్ తేజ్ అన్నారు. గతంలో సాయిధరమ్ తేజ్, రెజీనా మధ్య ప్రేమ వ్యవహారం జరిగిందని, అది పెళ్లి వరకు వచ్చి ఆగిపోయిందనే ఓ గాసిప్స్ అప్పట్లో హడావిడి చేసాయి. ఈ నేపథ్యంలో రెజీనా తన లవ్ అఫైర్ గురించి వ్యాఖ్యానించింది. అయితే.. తేజ్ వేరే వాళ్లతో ప్రేమలో పడటానికి నాతో క్లోజ్ గా వుండటం అడ్డెలా అవుతుందని కామెంట్ చేయటం ఆసక్తికరంగా మారింది.