చెర్రీ-ఎన్టీఆర్, జక్కన్న మల్టీస్టారర్ పై మెగా క్లారిటీ వచ్చేసింది

First Published 28, Nov 2017, 3:21 PM IST
sai dharam tej gives clarity on rajamouli charan ntr movie
Highlights
  • రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో పిక్ ను ట్విటర్ లో పెట్టి సర్ ప్రైజ్ ఇచ్చిన రాజమౌళి
  • మల్టీస్టారర్ సినిమా తెరకెక్కిస్తున్నారని టాలీవుడ్ సర్కిల్ లో చర్చలు
  • తాజాగా  ఈ మూవీపై అఫీషియల్ గా కన్ఫమ్ చేసిన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా మూవీ తెరకెక్కుతుందా.. ఫోటో పెడితే సినిమా అంటారా.. అంటూ రకరకాల ప్రచారం జరిగింది. ఎందుకంటే.. దీనిపై అఫీషియల్ గా ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో ఓ మల్టీ స్టారర్ మూవీ రాబోతుందనేది ఇక అఫీషియల్ గా కన్ఫమ్ అయిపోయింది.

 

టాలీవుడ్ సర్కిల్‌లో గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ మారిన ఈ మల్టీస్టారర్ మూవీపై మెగా హీరో సాయి ధరమ్ తేజ్ క్లారిటీ ఇచ్చాడు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్-రామ్ చరణ్ మల్టీస్టారర్ అంటే రూమర్స్ మాత్రమే అనుకున్నానని అయితే అది నిజం అని తెలిసిన తరువాత చాలా థ్రిల్లింగ్‌గా ఉందంటూ మూవీపైనున్న ఊహాగానాలకు తెరదించి మెగా, నందమూరి అభిమానుల్లో జోష్ నింపాడు సాయి ధరమ్ తేజ్. సాయి ధరమ్ తేజ్ ‘జవాన్’ మూవీ విడుదలకు రెడీ కావడంతో మూవీ ప్రమోషన్స్‌ లో భాగంగా నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో.. ఎన్టీఆర్-రామ్ చరణ్ మల్టీస్టారర్ మూవీపై తేజ్ క్లారిటీ ఇచ్చాడు.

 

రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ముగ్గురూ కలిసి ఉన్న ఫోటో చూసి ఓ పార్టీలో సరదాగా తీసుకున్న ఫొటో అనుకున్నాడట. అయితే ఫ్రెండ్ ఫోన్ చేసి ఆ ముగ్గురూ మల్టీస్టారర్ చేస్తున్నారంట తెలుసా? అని అడిగే సరికి చాలా థ్రిల్లింగ్‌గా అనిపించిందట. దాంతో ఫోన్ చేసిన మూవీ వివరాలు కనుకున్నాడట. ‘దర్శకుధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చెర్రీ,ఎన్టీఆర్ మల్టీస్టారర్  మూవీ నిజమే అని తెలిసిందన్నారు’ మెగా మేనళ్లుడు సాయి ధరమ్ తేజ్.

 

దీన్ని బట్టి ఈ మల్టీస్టారర్ మూవీ స్క్రిప్ట్ అంతా ఓకే అయ్యిందని... కథ చర్చల్లో భాగంగానే రాజమౌళిని ఎన్టీఆర్-చెర్రీ కలిసారని ఆ సందర్భంలో దిగిన ఫోటోను షేర్ చేస్తూ ఇన్ డైరెక్ట్‌ గా మల్టీస్టారర్ మూవీపై రాజమౌళి హింట్ ఇచ్చారనే వార్తలు నిజమేనని తేలిపోయింది. ఇక ఈ మూవీకి ‘యమధీర’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

 

ఈ క్రేజీ ప్రాజెక్ట్ వచ్చే మార్చి నెలలో పట్టాలెక్కే అవకాశాలు ఉన్నట్టు టాలీవుడ్‌లో చర్చ నడుస్తోంది. మొత్తానికి రాజమౌళి ఈ మల్టీస్టారర్ మూవీతో మరో సంచలనానికి తెరతీశాడని చెప్పాలి.

loader