తెలుగులో ‘జయం’ సినిమాతో పరిచయమైన సదా మళయాళ చిత్రంలో అవకాశం కొట్టేసిన సదా వేశ్య పాత్రలో మెప్పించనున్న సదా
తేజ దర్శకత్వంలో ‘ జయం’ సినిమాతో తెలుగు సినీరంగ ప్రవేశం చేసింది సదా. ఆ సినిమా భారీ విజయం సాధించడంతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ సినిమాలోని ఆమె మ్యానరిజమ్..‘వెళ్లవయ్యా.. వెళ్లు’ డైలాగ్ కూడా బాగా పాపులారిటీని తెచ్చిపెట్టింది. తర్వాత విక్రమ్ తో నటించిన అపరిచితుడు సినిమా కూడా ఆమె సినీ కెరిర్ లో పెద్ద హిట్గా నిలిచింది.
తర్వాత పలు సినిమాలు నటించినప్పటికీ.. పెద్దగా చెప్పుకోదగ్గ హిట్స్ ఏమీ లేవు. దీంతో గత కొద్ది కాలంగా ఓ ప్రముఖ టీవీ ఛానెల్ లో డ్యాన్స్ రియాల్టీ షో న్యాయనిర్ణేతగా పనిచేసింది. అయితే.. ఇటీవలే ఆమెకు మళయాళంలో ఓ సినిమా ఛాన్స్ వచ్చిందట.
1980ల కాలంనాటి నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ మళయాళ సినిమాలో.. సదా ఓ వేశ్యపాత్రలో నటిస్తుందట. సినిమా కథ విన్నాక.. సదాకి కంటి వెంట నీరు ఆగలేదట. కథ అంతా విన్నాక.. తన పాత్ర ప్రాధాన్యం నచ్చి.. ఈ చిత్రానికి ఒకే చెప్పిందట. చిత్ర షూటింగ్ తమిళనాడులోని ప్రముఖ పల్లెల్లో చిత్రీకరణ చేస్తున్నారట. ఈ చిత్రానికి అబ్దుల్ మజీద్ దర్శకత్వం వహిస్తున్నారు.
అంతా బాగానే ఉంది కానీ.. ఈ వయసులో సదా వేశ్య పాత్రకి సరిపోతుందా అనే డౌట్ అందరికీ వ్యక్తమౌతోంది. 3 పదుల వయసును సదా ఎప్పుడో దాటేసింది. సినీ కెరీర్ ప్రారంభించిన తొలి రోజుల్లో సదాకి ఇలాంటి పాత్ర దొరికితే బాగుండేదేమో అన్న టాక్ కూడా వినపడుతోంది. చూద్దాం.. ఎంత వరకు సదా ఈ పాత్రలో ప్రేక్షకులను మెప్పిస్తుందో..
